తుది జట్టులో అశ్విన్‌కు చోటు: కోహ్లీ ఏమన్నాడో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న ఇంగ్లాండ్‌లో ఫాస్ట్ పిచ్‌ల నేపథ్యంలో స్పిన్నర్ అయిన అశ్విన్‌ను పక్కను పెట్టారు.

అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌కు అశ్విన్‌కు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. టోర్నీలో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల తలపడతున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.

సఫారీలతో మ్యాచ్‌కు సంబంధించి తమకు అందుబాటులో ఉన్న అన్ని వనరులపైనా చర్చించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. ఇందులో భాగంగా తుది జట్టులో అశ్విన్‌కు చోటు దక్కుతుందా? అనే ప్రశ్నకు గాను తుది జట్టులో స్వల్ప మార్పులు ఉంటాయని కోహ్లీ సంకేతాలిచ్చాడు.

జట్టు ప్రణాళికపై కోహ్లీ

జట్టు ప్రణాళికపై కోహ్లీ

జట్టు ప్రణాళిక ఏమిటో ఇప్పుడే చెప్పదలుచుకోలేదని సమాధానాన్ని దాటవేశాడు. 'రేపు జరిగే మ్యాచ్‌లో నిలకడ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరైతే పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తారో వారిదే విజయం. గతంలో నాకు ఎదురైన అనుభవాల ఆధారంగానే ఈ విషయం చెబుతున్నా. మాకున్న అన్ని వనరులు గురించి ఇప్పటికే చర్చించాం. సఫారీలతో అమీతుమీ పోరుకు సిద్ధంగా ఉన్నాం' అని కోహ్లీ అన్నాడు.

తుది జట్టులో అశ్విన్‌కు చోటు

తుది జట్టులో అశ్విన్‌కు చోటు

దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్‌ డికాక్‌, జేపీ డుమిని, డేవిడ్‌ మిల్లర్‌ వంటి నాణ్యమైన లెఫ్టాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నందున ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆఫ్ బ్రేక్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టం కనుక అశ్విన్‌ను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ సైతం

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ సైతం

దీంతో గత మ్యాచ్‌లో బంతితో విఫలమైన పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా లేదా ఉమేష్ యాదవ్‌లలో ఎవరో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా, అదివారం నాటి మ్యాచ్‌లో అశ్విన్‌కు చోటు దక్కుతుందని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకన్జీ సైతం అభిప్రాయపడ్డాడు. తమతో చావో రేవో మ్యాచ్‌లో అశ్విన్ ఎంపిక కూడా కీలకం కానుందని మెకన్జీ పేర్కొన్నాడు.

భారత జట్టు తుది జట్టులో కీలక మార్పులు

భారత జట్టు తుది జట్టులో కీలక మార్పులు

ఈ మేరకు భారత జట్టు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయని తెలిపాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కొన లేకపోయినా వన్డేల్లో మాత్రం టీమిండియా స్పిన్నర్లపై అద్భుతంగా ఆడారని గుర్తుచేశాడు. లంక చేతిలో ఓడిన భారత్‌పై ఒత్తిడి నెలకొన్న తరుణంలో దానిని సద్వినియోగం చేసుకుంటామని చెప్పాడు.

భారత్‌ను తక్కువగా అంచనా వేయలేం

భారత్‌ను తక్కువగా అంచనా వేయలేం

అయితే ఒక్క మ్యాచ్‌లో ఓటమితో భారత్‌ను తక్కువగా అంచనా వేయడం లేదని చెప్పాడు. అంతకు ముందు కోహ్లీసేన, దక్షిణాఫ్రికాలు సైతం గొప్ప ప్రదర్శనలు చేశారని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సెమీస్‌కు చేరుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India captain Virat Kohli refused to divulge information on the team combination for tomorrow's (June 11) must-win match against South Africa in the ICC Champions Trophy 2017. However, the skipper answered the question on Ravichandran Ashwin's selection
Please Wait while comments are loading...