ఆ షాట్ నువ్వింకా బాగా ఆడతావ్!: కోహ్లీకి ఇంగ్లీష్ స్నూకర్ ప్లేయర్ సర్‌ప్రైజ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 40 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్(102 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు 

Virat Kohli Finds Surprise Fan In English Snooker Player

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించాడు. క‌మిన్స్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ ఆడిన షాట్‌.. ఈ మ‌ధ్య కాలంలో బెస్ట్ షాట్ అని విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

అయితే కోహ్లీ ట్వీట్‌కు ఇంగ్లిష్ స్టార్ స్నూక‌ర్ ప్లేయ‌ర్ మాథ్యూ సెల్ట్‌ స్పందించాడు. 'ఈ షాట్‌ను నువ్వు కళ్లు మూసుకుని అడాలి. ఎందుకంటే నువ్వు డాడీవి' అని కోహ్లీ ట్వీట్‌పై స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ కావడంతో సర్వత్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఈ క్రమంలో ఓ ఇంగ్లీషు అభిమాని కోహ్లీని ఇలా ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. మాథ్యూ సెల్ట్‌ ట్వీట్‌పై పలువురు భారతీయ అభిమానులు సైతం స్పందించారు.

కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు చేరుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ben Stokes hit a career-best 102 not out and captain Eoin Morgan 87 as England knocked Australia out of the Champions Trophy with a 40-run win over their arch-rivals at Edgbaston on Saturday.
Please Wait while comments are loading...