మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అదే: విరాట్ కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వన్డేల్లో నెంబర్ ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించడంపై కెప్టెన్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుత చాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటివరకు ఇదే తమ ఉత్తమ ప్రదర్శన అని పేర్కొన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు  | స్కోరు కార్డు

మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు మ్యాచ్‌లో మా తరఫున వేలెత్తి చూపడానికి ఎలాంటి పొరపాట్లు లేవు. ఇది మా అత్యుత్తమ గేమ్‌ అని చెప్పవచ్చు' అని కోహ్లీ అన్నాడు. టోర్నీలో భాగంగా అదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలవడం కలిసొచ్చింది

టాస్ గెలవడం కలిసొచ్చింది

‘టాస్‌ గెలువడం కలిసొచ్చింది. వికెట్‌ పెద్దగా మారలేదు. బ్యాటింగ్‌కు మైదానం బాగా సహకరిస్తుందని మేం భావించాం. మా బౌలర్లు నిజంగా చాలా బాగా ఆడారు. ఫీల్డర్లు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మైదానంలో మేం పరిపూర్ణ ఆటతీరును కనబరిచాం' అని కోహ్లి వివరించాడు.

అవకాశాలను ఒడిసిపట్టుకున్నాం

అవకాశాలను ఒడిసిపట్టుకున్నాం

‘మేం అవకాశాలను చాలా బాగా ఒడిసిపట్టుకున్నాం. అందువల్లే అంత బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనఫ్‌ను 190 పరుగులకు పరిమితం చేయగలిగాం. ఏబీ డివిలియర్స్‌ త్వరగా అవుట్ చేయడం మంచిది అయింది. అతను మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థిని దెబ్బతీయగలడు. అతన్ని అవుట్‌ చేయడం మ్యాచ్‌లో మాకు గొప్ప మలుపు. జట్టు సభ్యులు అంత తీవ్రత పెట్టి ఆడటం ఎంతో బాగుంది' అని కోహ్లి వివరించాడు.

38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసిన భారత్

38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసిన భారత్

192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధవాన్ 78, కోహ్లీ 76(నాటౌట్), యువరాజ్ సింగ్ 23(నాటౌట్), రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు. అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా 44.3 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆలౌటైంది.

టోర్నీ నుంచి వైదొలగిన దక్షిణాఫ్రికా

తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరగా, దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి వైదొలగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీఫైనల్ చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ పైనల్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A delighted Indian captain Virat Kohli spoke about the moment which turned the game agains South Africa in the ICC Champions Trophy 2017 yesterday (June 11).
Please Wait while comments are loading...