ఇంగ్లాండ్ జెర్సీ ధరిస్తా: దాదాతో పందెంలో ఓడిపోయిన వార్న్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కట్టిన పందెంలో ఓడిపోయినందుకు ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఇంగ్లాండ్ జెర్సీ వేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేన్ వార్న్ అభిమానులతో పంచుకున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు | స్కోరు కార్డు

'గంగూలీ... నీతో కాసిన పందెంలో ఓడిపోయాను. ఇంగ్లాండ్ వన్డే జెర్సీ ఉంటే నాకు పంపు. పందెం ప్రకారం నేను దానిని ధరిస్తాను. ఇంగ్లాండ్ జెర్సీ వేసుకుని ఉన్న ఫోటోను త్వరలోనే ట్వీట్ చేస్తా' అని షేన్ వార్న్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 10 (శనివారం) నాడు ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలుస్తుందంటూ గొప్పలకు పోయిన షేన్ వార్న్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పందెం కాశాడు.

ఇంతకీ ఆ పందెం ఏమిటంటే ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే ఆసీస్ జెర్సీని గంగూలీ ధరించాలి. అదే సమయంలో ఇంగ్లాండ్ గెలిస్తే ఆ జట్టు జెర్సీని వార్న్ ధరిస్తాడన్నమాట. తాను కాసిన పందెంలో ఓడిపోయిన వార్న్ ఇంగ్లాండ్ జెర్సీని ధరించేందుకు సిద్ధపడ్డాడు.

'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో ఛాలెంజ్

'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో ఛాలెంజ్

ఛాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటరీ చేసేందుకు గాను పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు లండన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా కొన్ని రోజుల క్రితం 'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా గంగూలీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వార్న్, మైకేల్ క్లార్క్‌లు పాల్గొన్నారు.

ఫేవరేట్ జట్లను ఎంపిక చేసిన గంగూలీ, వార్న్, మైకేల్ క్లార్క్‌

ఫేవరేట్ జట్లను ఎంపిక చేసిన గంగూలీ, వార్న్, మైకేల్ క్లార్క్‌

ఇందులో భాగంగా ఈ ముగ్గురూ తమ తమ ఫేవరేట్ జట్లను ఎంపిక చేశారు. ఈ క్రమంలో జూన్‌ 18న జరిగే ఫైనల్‌లో భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడతాయని క్లార్క్‌ ఆశాభావం వ్యక్తం చేయగా, గంగూలీ వ్యతిరేకించాడు. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా ఆస్ట్రేలియా కంటే ఇంగ్లాండే పటిష్టంగా ఉందని గంగూలీ చెప్పాడు.

నొచ్చుకున్న షేన్ వార్న్

నొచ్చుకున్న షేన్ వార్న్

అయితే గంగూలీ చెప్పిన సమాధానానికి షేన్ వార్న్ నొచ్చుకున్నాడు. గ్రూప్-ఎ మ్యాచ్‌లో జూన్ 10వ తేదీన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తప్పక గెలుస్తుందంటూ గంగూలీకి షేన్ వార్న్ నుంచి ఓ సవాల్ ఎదురైంది.

ఒక్క మ్యాచ్ గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా

ఒక్క మ్యాచ్ గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా

ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా విజయం సాధిస్తే, గంగూలీ ఆసీస్‌ జెర్సీ ధరించాలని, అంతేకాదు తనకు డిన్నర్‌ పార్టీ ఇవ్వాలని కోరాడు. ఒకవేళ అదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ గెలిస్తే తాము ఇంగ్లాండ్‌ జెర్సీ ధరిస్తామని వార్న్‌ అన్నాడు. ఈ సవాల్‌ను గంగూలీ స్వీకరించాడు. ఇప్పుడు ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australian spin legend Shane Warne is get ready to wear an England jersey after he lost a bet with former India captain Sourav Ganguly at the ICC Champions Trophy 2017.
Please Wait while comments are loading...