ఇంగ్లాండ్ జెర్సీ వేసుకున్నాడు: మాట నిలబెట్టుకున్న షేన్ వార్న్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ త‌న‌కు ఇష్టం లేని ప‌ని ఒక‌టి చేశాడు. జీవితంలో ఎప్పుడూ వేసుకోవ‌ద్ద‌నుకున్న ఇంగ్లాండ్ జెర్సీని వార్న్ వేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కట్టిన పందెంలో ఓడిపోయినందుకు ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఇంగ్లాండ్ జెర్సీ వేసుకోవాల్సి వచ్చింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

తాను ఇంగ్లాండ్ జెర్సీ వేసుకున్న ఫోటోను షేన్ వార్న్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తాను ఇంగ్లండ్ జెర్సీ వేసుకున్న ఫొటోను వార్న్ ట్వీట్ చేశాడు. దుర‌దృష్ట‌వ‌శాత్తు తాను చేయాల్సిన ప‌ని ఇంకా ఉంద‌ని ఆ ట్వీట్‌లో వార్న్ రాశాడు. ఐసీసీ కూడా వార్న్ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సంద‌ర్భంగా షేన్ వార్న్ సౌరభ్ గంగూలీతో ఓ ఛాలెంజ్ చేశాడు. జూన్ 10 (శనివారం) నాడు ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలుస్తుందంటూ గొప్పలకు పోయిన షేన్ వార్న్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పందెం కాశాడు.

ఇంతకీ ఆ పందెం ఏమిటంటే ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే ఆసీస్ జెర్సీని గంగూలీ ధరించాలి. అదే సమయంలో ఇంగ్లాండ్ గెలిస్తే ఆ జట్టు జెర్సీని వార్న్ ధరిస్తాడన్నమాట. తాను కాసిన పందెంలో ఓడిపోయిన వార్న్ ఇంగ్లాండ్ జెర్సీని వేసుకున్నాడు. ఇప్పుడు గంగూలీని డిన్న‌ర్‌కు కూడా తీసుకెళ్లాల్సి ఉంది. ఒక‌వేళ గంగూలీ ఓడిపోయి ఉంటే అత‌డు రోజంతా ఆస్ట్రేలియా జెర్సీ వేసుకోవాల్సి వ‌చ్చేది.

I'm in a world of hurt wearing this shirt right now, but a bets a bet so on with the England shirt ! #CT17 😩

A post shared by Shane Warne (@shanewarne23) on Jun 15, 2017 at 3:32am PDT

ఛాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటరీ చేసేందుకు గాను పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు లండన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా కొన్ని రోజుల క్రితం 'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా గంగూలీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వార్న్, మైకేల్ క్లార్క్‌లు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఈ ముగ్గురూ తమ తమ ఫేవరేట్ జట్లను ఎంపిక చేశారు. ఈ క్రమంలో జూన్‌ 18న జరిగే ఫైనల్‌లో భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడతాయని క్లార్క్‌ ఆశాభావం వ్యక్తం చేయగా, గంగూలీ వ్యతిరేకించాడు. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా ఆస్ట్రేలియా కంటే ఇంగ్లాండే పటిష్టంగా ఉందని గంగూలీ చెప్పాడు.

ఇంగ్లాండ్ జెర్సీ ధరిస్తా: దాదాతో పందెంలో ఓడిపోయిన వార్న్

అయితే గంగూలీ చెప్పిన సమాధానానికి షేన్ వార్న్ నొచ్చుకున్నాడు. గ్రూప్-ఎ మ్యాచ్‌లో జూన్ 10వ తేదీన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తప్పక గెలుస్తుందంటూ గంగూలీకి షేన్ వార్న్ నుంచి ఓ సవాల్ ఎదురైంది.

ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా విజయం సాధిస్తే, గంగూలీ ఆసీస్‌ జెర్సీ ధరించాలని, అంతేకాదు తనకు డిన్నర్‌ పార్టీ ఇవ్వాలని కోరాడు. ఒకవేళ అదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ గెలిస్తే తాము ఇంగ్లాండ్‌ జెర్సీ ధరిస్తామని వార్న్‌ అన్నాడు. ఈ సవాల్‌ను గంగూలీ స్వీకరించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Champions Trophy has produced unexpected results all tournament, with South Africa and Australia both crashing out in the group stage and Pakistan toppling England to make the final. But even in a tournament of surprises nobody expected to see Shane Warne wearing an England jersey.
Please Wait while comments are loading...