సాధ్యమైనంత త్వరగా అతడిని అవుట్ చేయాలి: కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల తలపడతున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు కోహ్లీ స్పష్టం చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు

రేపటి మ్యాచ్‌కు సంబంధించి తమకు అందుబాటులో ఉన్న అన్ని వనరులపైనా చర్చించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. 'ప్రతి మ్యాచూ కీలకమే. కెప్టెన్‌గా ఫలానా మ్యాచ్‌ పెద్దది అని చెప్పలేను. ఐతే ఒక క్రికెటర్‌గా ఇలాంటి మ్యాచ్‌లు ఆడటానికి నేను ఎక్కువ ఆసక్తి చూపిస్తాను. ఈ తరహా మ్యాచ్‌లు ఆటగాడిగా ఎదగడానికి ఉపకరిస్తాయి' అని కోహ్లీ చెప్పాడు.

Champions Trophy: Will look to stop 'most coveted cricketer' AB de Villiers, says Virat Kohli

అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌కి గత మ్యాచ్‌ల ప్రదర్శనతో సంబంధం ఉండదని కోహ్లీ తేల్చి చెప్పాడు. సాధ్యమైనంత త్వరగా అతణ్నిఅవుట్‌ చేసే మార్గం చూడాలని కోహ్లీ చెప్పాడు. టోర్నీలో భాగంగా అంతకముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో తుది జట్టులో స్వల్ప మార్పులు ఉంటాయని కోహ్లీ సంకేతాలిచ్చాడు. అయితే జట్టును సమతుల్యంగా ఉంచడమే ఇక్కడ ప్రధానంగా కోహ్లీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ను కూడా సాధారణ మ్యాచ్ లాగే తీసుకుని ఆడాలని ఆటగాళ్లకు సూచించాడు.

'రేపు జరిగే మ్యాచ్‌లో నిలకడ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరైతే పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తారో వారిదే విజయం. గతంలో నాకు ఎదురైన అనుభవాల ఆధారంగానే ఈ విషయం చెబుతున్నా. మాకున్న అన్ని వనరులు గురించి ఇప్పటికే చర్చించాం. సఫారీలతో అమీతుమీ పోరుకు సిద్ధంగా ఉన్నాం' అని కోహ్లీ అన్నాడు.

గ్రూప్ స్టేజీలో ఇదే చివరి మ్యాచ్ కావడంతో పూర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతామని కోహ్లీ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు చేరుకుంటుంది. దీంతో కోహ్లీకి ఈ మ్యాచ్ పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు ఈ మ్యాచ్‌కి వరుణుడి భయం కూడా ఉంది.

ఆదివారం వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. అయితే వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే భారత్‌కు మంచే జరుగుతుంది. నెట్‌ రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న టీమిండియా సెమీస్‌కు చేరుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India captain Virat Kohli today (June 10) said they will try to stop AB de Villiers from scoring big when the two sides meet in a virtual quarterfinal at ICC Champions Trophy 2017 tomorrow (June 11).
Please Wait while comments are loading...