ఓవల్ స్టేడియంలో ఏం జరిగింది?: యువీకి అతీంద్రియ శక్తులు ఉన్నాయా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు సూపర్ నాచురల్ పవర్స్ ఉన్నాయా? ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిజమని రుజువు చేశాడు. ఈ వీడియోని చూస్తే మీరు కూడా అవుననే అంటారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే రెండో సెమీ పైనల్‌లో భారత జట్టు గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరగనుంది. కాస్త విరామం దొరకడంతో క్రికెటర్లు సరదాగా గడుపుతున్నారు. ఈ మ్యాచ్‌కి ముందు యువరాజ్ తనలో సూపర్ నాచురల్ పవర్స్ ఉన్నాయని నిరూపించే వీడియోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో యువరాజ్ సింగ్ తన చేతులను అలా తిప్పుతుంటే దానికి అనుగుణంగా ది ఓవల్ స్టేడియం డోర్లు మూసుకోవడం, తెరుచుకోవడం జరిగింది.

Champions Trophy: Yuvraj Singh shows his 'super powers' in video shot by Virat Kohli

'మీకు సూపర్ పవర్స్ ఉన్నాయని నమ్మినప్పుడు! వీడియో సహకారం విరాట్ కోహ్లీ' అంటూ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో కామెంట్ పెట్టాడు. వీడియోలో యువరాజ్ సింగ్ స్టేడియం డోర్లు వద్దకు వెళ్లి అలా బయటకు అనగానే ఓపెన్ అయ్యాయి. డోర్లు ఓపెన్ అయిన తర్వాత యువరాజ్ లోపలికి వెళ్లాడు.

When u think u have super powers 💥! 🤣🤣 video courtesy @virat.kohli

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on Jun 13, 2017 at 10:00am PDT

అనంతరం తిరిగి మళ్లీ యువీ తన చేతులను కదుపుతున్న దానిని బట్టి అవి మూసుకున్నాయి. ఈ తతంగం మొత్తాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ వీడియో రూపంలో బంధించాడు. నిజానికి ది ఓవల్ స్టేడియంలో సెన్సార్లతో డోర్లు వాటంతటవే తెరుచుకోవడం తెలిసిందే. తన శక్తులతో ఆ డోర్లు తెరుచుకున్నట్లు యువరాజ్ సరదాగా ఈ వీడియోలో చూపించాడు. యువరాజ్ చేసిన ఈ మ్యాజికల్‌కు క్రికెట్ అభిమానులు ముగ్ధులయ్యారు. యువీ ఈ వీడియోని పోస్టు చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా యువరాజ్ సింగ్ అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే యువీకి 300వ వన్డే కావడం విశేషం. భారత తరపున కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే మూడొందల వన్డేల మైలురాయిని అందుకున్నారు.

తాజాగా యువీ వారి సరసన చేరనున్నాడు. అంతకుముందు టీమిండియా మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే 300 వన్డేలు ఆడిన వారి జాబితాలో ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Does India all-rounder Yuvraj Singh have supernatural powers? The answer could be yes for his supporters as a new video shot by captain Virat Kohli proves this.
Please Wait while comments are loading...