10000: చరిత్ర సృష్టించేందుకు 3 పరుగుల దూరంలో గేల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్‌గేల్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అతి కొద్ది దూరంలో ఉన్నాడు. రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌లో మూడు పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో పదివేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ పదో సీజన్‌కు ముందు 63 పరుగుల దూరంలో ఉన్న గేల్ ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల్లో ఈ రికార్డుని సాధిస్తాడని అభిమానులు భావించినా అది జరగలేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన 60 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ ఆరంభ వేడుకల అనంతరం సన్ రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో క్రిస్ గేల్ 32 పరుగులు చేశాడు.

Chris Gayle chases landmark against Gujarat Lions

ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి రావడంతో రెండు మ్యాచ్‌లకు గేల్ దూరమయ్యాడు. దాంతో క్రిస్ గేల్ పదివేల పరుగుల రికార్డు కోసం అభిమానులు నిరీక్షించాల్సి వచ్చింది.

అయితే మంగళవారం నాటి మ్యాచ్‌కు క్రిస్ గేల్ దాదాపు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు ఏబీ డివిలియర్స్ దూరం కావడంతో అతడి స్ధానంలో గేల్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో గేల్‌కు అవకాశం లభిస్తే చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Most times, the use of the word "history" while talking about Twenty20 can be dismissed as hyperbole. On Tuesday, though, the Saurashtra Cricket Association Stadium, Rajkot could see a genuinely historic moment - if he scores 3, Chris Gayle will become the first batsman to reach 10,000 runs in T20s.
Please Wait while comments are loading...