న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళా రిపోర్టర్‌తో అసభ్యం: గేల్‌కు 10వేలడాలర్ల ఫైన్

మెల్బోర్న్: ఓ మహిళా టీవీ రిపోర్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడం, అగౌరవపర్చే వ్యాఖ్యలు చేసిన నేపత్యంలో వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌‌గేల్‌‌కు 10వేల ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారు. సోమవారం జరిగిన బిగ్ బాష్ లీగ్ ట్వంటీ20 మ్యాచ్ సందర్భంగా గేల్ ఓ మహిళా రిపోర్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను అగౌరవపర్చేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆస్టేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్‌గేల్ మెల్‌బోర్న్ రెనగేడ్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో టాస్మేనియాతో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ తరఫున ఆడిన గేల్‌ 15 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ నెగ్గింది.

Chris Gayle fined $10,000 for 'inappropriate' comments to female TV reporter

మ్యాచ్ అనంతరం టెన్‌స్పోర్ట్స్ క్రికెట్ ప్రజెంటర్ మెల్‌మెక్ లాఫ్లిన్‌, క్రిస్ గేల్‌ను ఇంటర్యూ చేసింది. ఈ సందర్భంగా టీవీ యాంకర్‌ మెల్‌మెక్ లాఫ్లిన్‌తో క్రిస్‌గేల్ అసభ్యంగా మాట్లాడాడు. 'నీ కళ్లు అందంగా ఉన్నాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం తాగేందుకు వెళ్దామా.. సిగ్గుపడకు బేబీ' అంటూ గేల్ చెప్పాడు.

క్రిస్‌‌గేల్ మాటలకు కొంత ఇబ్బందిపడినా... తాను సిగ్గుపడడం లేదంటూ మెల్‌మెక్ లాఫ్లిన్‌ ఇంటర్వ్యూను కొనసాగించింది. కాగా, గేల్ మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు గేల్ వ్యాఖ్యలపై వ్యాఖ్యలపై బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ (బీబీఎల్), ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించాయి.

క్రిస్ గేల్ వ్యాఖ్యలు అవమానకరమైనవని బీబీఎల్ వ్యాఖ్యానించింది. క్రిస్ గేల్ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, వాటిని తాము జోక్‌గా తీసుకోవడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ మెక్‌గ్రాత్ స్పష్టం చేశారు. బిగ్ బాష్ సీఈఓ ఎవెర్డ్ సైతం గేల్ తీరు సరికాదని అన్నారు. దీంతో క్రిస్‌గేల్ మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఆ మహిళ రిపోర్టర్‌కు క్షమాపణలు చెప్పాడు.

ప్రజెంటర్ మెల్‌మెక్ లాఫ్లిన్‌ పట్ల తాను అవమానకర, అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఆమె తన వ్యాఖ్యలకు బాధపడితే క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను జోక్‌గా తీసుకోవాలని, వాటిని సీరియస్‌గా తీసుకొవద్దని గేల్ పేర్కొన్నారు. నిరుడు కూడా కరీబియన్‌ లీగ్‌ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టుతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడి విమర్శల పాలయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X