జూన్ 6న వేలానికి క్రిస్ గేల్ పదివేల పరుగులు బ్యాట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్‌గా వెస్టిండిస్‌ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌ గేల్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. రాజ్ కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఈ ఘనతను సాధించాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు

ఐపీఎల్ పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 38 బంతుల్లో 77 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్లు క్రిస్ గేల్ (38 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సులు), విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీలతో చెలరేగారు.

Chris Gayle’s record 10,000 T20 runs milestone bat to be auctioned

ఈ మ్యాచ్‌లో టీ20ల్లో పది వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇక కోహ్లీ 50 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 64 పరుగుల్ని నమోదు చేశాడు. వీరిద్దరి జోడీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రిస్ గేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అయితే ఈ మైలు రాయిని చేరుకున్న సమయంలో క్రిస్ గేల్ ఆడిన బ్యాట్‌ని వేలం వేయనున్నారు. జూన్‌ 6వ తేదీన ప్రారంభించే క్రిస్‌ గేల్‌ ఫౌండేషన్‌కు ఆర్థిక వనరుల సేకరణ కోసం గేల్‌ బ్యాట్‌ వేలం వేయనున్నాడు. టీ20 ఫార్మెట్‌లో క్రిస్ గేల్ అత్యధిక స్కోరు 175 నాటౌట్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chris Gayle’s bat with which he reached the 10,000-run mark, would be put up for auction at the Chris Gayle Foundation launch on June 6.
Please Wait while comments are loading...