క్రికెట్ కూడా వ్యాపారమే: సచిన్, గంగూలీ బాటలో క్రిస్ గేల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లీగ్ తరహాలో ఓ జట్టుని కొనుగోలు చేసేందుకు గాను వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఆసక్తిని కనబరుస్తున్నాడు. ఇందులో భాగంగా కొన్ని కమర్షియల్ వెంచర్స్‌తో గేల్ చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో క్రిస్ గేల్ మాట్లాడుతూ క్రికెట్‌ కూడా ఒక రకంగా వ్యాపారమేనని, స్టేక్ హోల్డర్స్ సాధ్యమైనంత పెద్దమొత్తంలో ఆర్జించాలని కోరుకుంటారని చెప్పాడు. సచిన్‌, గంగూలీ వంటి దిగ్గజాలు సైతం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత క్రీడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారని గేల్‌ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

భారత్‌లో ఇప్పటికే ఆదరణ పొందిన ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొనుగోలు చేయగా, అథ్లెటికో డీ కోల్‌కతా జట్టుని సౌరవ్ గంగూలీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫ్రాంచైజీలకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు తన వద్ద ఉన్నాయని వాటి గురించి చర్చిస్తున్నట్టు గేల్ తెలిపాడు.

బెంగళూరులోని గేమింగ్‌ సంస్థ ఐఓఎన్‌ఏలో పెట్టుబడులు

బెంగళూరులోని గేమింగ్‌ సంస్థ ఐఓఎన్‌ఏలో పెట్టుబడులు

పెద్ద బ్రాండ్స్‌తో కలిసి పనిచేసేటప్పుడు ఒక క్రికెటర్‌గా ఇతర క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుందని అన్నాడు. బెంగళూరులోని గేమింగ్‌ సంస్థ ఐఓఎన్‌ఏలో గురువారం పెద్ద మొత్తంలో గేల్ పెట్టుబడి పెట్టినట్లు చెప్పాడు. అయితే ఆ మొత్తాన్ని బయటకు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

Indian cricket team creates world record for most 300-plus scores in ODIs, surpass Australia | Oneindia News
70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గేమింగ్ వెంచర్

70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గేమింగ్ వెంచర్

బెంగళూరులో ఐఓఎన్‌ఏకి ఇప్పటికే వర్జీనియా మాల్ పేరిట 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గేమింగ్ వెంచర్ ఉంది. సింగపూర్‌కి చెందిన వెస్టాసియా కంపెనీ తొలి రౌండ్‌లో పెద్ద మొత్తంలో ఫండ్స్ సమకూర్చింది. మరోవైపు 2019 వరల్డ్ కప్‌కు అర్హత సాధించడమే ఇప్పుడు తమ ముందున్న ప్రధాన లక్ష్యం అని గేల్ తెలిపాడు.

2019 వరల్డ్ కప్‌కి అర్హత సాధించడమే లక్ష్యం

2019 వరల్డ్ కప్‌కి అర్హత సాధించడమే లక్ష్యం

2019 వరల్డ్ కప్‌కి ఇంగ్లాండ్ వేదిక కానుంది. ఐసీసీ వెల్లడించే ర్యాంకుల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు టాప్‌-8 స్థానాల్లో ఉన్న జట్లే ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం వెస్టిండీస్‌ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది. త్వరలో విండీస్‌ జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో విండీస్‌ జట్టు లేకపోవడం బాధ కలిగించింది

ఛాంపియన్స్‌ ట్రోఫీలో విండీస్‌ జట్టు లేకపోవడం బాధ కలిగించింది

ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ20 ఆడనుంది. ఈ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేసి వన్డే ర్యాంకింగ్స్‌లో తమ ర్యాంకును మెరుగుపరుచుకునే అవకాశం వచ్చిందని క్రిస్ గేల్‌ అన్నాడు. ఎలాగైనా సరే ట్రోఫీ గెలవాలని భావిస్తున్నట్లు క్రిస్ గేల్‌ చెప్పాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో విండీస్‌ జట్టు పాల్గొనలేకపోవడం బాధ కలిగించిందన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Swashbuckling West Indian opener Chris Gayle today showed interest in owning an ISL-type team and said he is in discussions with few stakeholders for some commercial ventures.
Please Wait while comments are loading...