చివరిరోజు ఫోకస్ మొత్తం జడేజాపైనే పెట్టాం: ఆసీస్ కోచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు చివరి రోజు ఆటలో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎదుర్కొని నిలబడటం తమకు అసలైన ఛాలెంజ్ అని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ డారెన్ లీమన్ స్పష్టం చేశాడు.

రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే (ఫోటోలు)

నాలుగో రోజు ఆటలో స్వల్ప వ్యవధిలో జడేజా రెండు వికెట్లు తీసిన సంగి తెలిసిందే. ఈ నేపథ్యంలో జడేజాపైనే తాము ఎక్కువ దృష్టి సారించినట్లు లీమన్ పేర్కొన్నాడు. నాలుగో రోజు ఆటలో పెవిలియన్‌కు చేరిన ఓపెనర్ డేవిడ్ వార్నర్, లియాన్‌లు ఇద్దరూ మంచి బంతులకే అవుటయ్యాడని పేర్కొన్నాడు.

ఇలాంటి సంఘటనలు క్రికెట్ ఆటలో సహజమని చెప్పుకొచ్చాడు. చివరి రోజు గ్రేట్ ఛాలెంజ్ అని, టీమిండియా బౌలర్లను తాము దీటుగా ఎదుర్కొంటామని లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Combating Ravindra Jadeja on final day will be challenging for Australia: Darren Lehmann

'మూడో టెస్టు ఆఖరి రోజు ఆట మాకు ఛాలెంజ్. ప్రధానంగా జడేజాను సమర్దవంతంగా ఎదుర్కోవాలి. అతను సంధించిన రెండు అద్భుతమైన బంతులకు రెండు వికెట్లను కోల్పోయాం. ముఖ్యంగా డేవిడ్ వార్నర్‌ను జడేజా అవుట్ చేసిన తీరు అమోఘం. జడేజాపై మా ఫోకస్ పెట్టాం. మా వికెట్లను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, మా పది వికెట్లను తీసి గెలుపొందడం భారత్‌కు కఠినమైన సవాల్' అని కోచ్ డారెన్ లీమన్ అన్నాడు.

వేలెత్తాడు: తల గోక్కుని భలేగా కవర్‌ చేసేశాడు (వీడియో)

నాలుగో రోజు పుజారా (525 బంతుల్లో 21 ఫోర్లతో 202) మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఫలితంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 603/9 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. పుజారాకి తోడు సాహా (233 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 117) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఏడో వికెట్‌కు వీరిద్దరి 199 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ భాగస్వామ్యమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివర్లో జడేజా (55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్‌) మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో ఆతిథ్య జట్టుకు 152 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్‌ 210 ఓవర్లు బౌలింగ్‌ చేసినా భార‌త్‌ను ఆలౌట్‌ చేయలేకపోయింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7.2 ఓవర్లలో 2 వికెట్లకు 23 పరుగులు చేసింది. వార్నర్ (14), లియాన్ (2) విఫలమయ్యారు. రెన్‌షా 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చివరిరోజు ఆట మాత్రమే మిగిలున్న మ్యాచ్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 129 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australia coach Darren Lehmann on Sunday (March 19) said it would be a real challenge for his team comprising five left-handers to negotiate the left-arm spin of Ravindra Jadeja on the final day here on Monday (March 19).
Please Wait while comments are loading...