అది కూడా తెలియదు: కోహ్లీపై నోరు చేసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అడిలైడ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సూదర్లాండ్ నోరు పారేసుకున్నారు. క్షమాపణ ఎలా చెప్పాలో కూడా భారత కెప్టెన్‌కు తెలియదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌ సందర్భంగా భారత, ఆస్ట్రేలియా మధ్య పలు వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఆరోపణలు చేసినందుకు కోహ్లీ స్మిత్‌కు క్షమాపణలు చెప్పాలా అని ఆడిలైడ్‌కు చెందిన ఓ రేడియో స్టేషన్ సూదర్లాండ్‌ను అడింగింది. విరాట్ కోహ్లీకి సారీ అనే మాటను ఎలా పలుకాలో తెలుసా అనేది తనకు అనుమానమని ఆయన అన్నారు.

Cricket Australia chief James Sutherland takes a dig at Virat Kohli

సుదీర్ఘమైన నాలుగు టెస్టుల సిరీస్‌లో క్రికెటర్లు ఏకమై కొంత నవ్వును పంచుతారేమో చూడాలని అన్నాడు. డిఆర్ఎస్‌కు అడగడానికి ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు డ్రెసింగ్ రూమ్‌ వైపు చూసిన సంఘటనలు రెండు జరిగాయని కోహ్లీ మీడియా సమావేశంలో ఆరోపించారు.

తాను అక్కడే ఉన్నానని, కొద్దిగా చూశానని, కానీ తాను ఏమీ చేయలేకపోయానని సూదర్లాండ్ అన్నారు. స్టీవెన్ స్మిత్ తనంత తానుగా అంగీకరించాడని, తాను తప్పు చేశానని చెప్పాడని, అతని వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం సరైంది కాదని తాను అనుకున్నానని ఆయన అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cricket Australia chief James Sutherland took a light-hearted jibe at Virat Kohli, sarcastically implying that the India captain does not know how to apologise.
Please Wait while comments are loading...