విజయం వరిస్తుందా?: చొక్కాలు విప్పేసి నెట్ ప్రాక్టీస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. అయితే ఇండోర్‌లో ఉక్కపోత కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో చొక్కాలు విప్పేశారు.

వరుస ఓటములు

వరుస ఓటములు

వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో బలహీనంగా ఉండటం వల్లే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైనట్లు పంజాబ్‌ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.

మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే

మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే

ఈ నేపథ్యంలో ముంబైతో జరిగే మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే ఉద్దేశంతో పంజాబ్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా నెట్ ప్రాక్టీస్ చేశారు. అయితే ఉక్కపోత కారణంగా విదేశీ ఆటగాళ్లు డేవిడ్‌ మిల్లర్‌, స్టాయినిస్‌ చొక్కాలు తీసేసి మరీ ప్రాక్టీసులో పాల్గొన్నారు.

బౌలింగ్‌ ప్రాక్టీస్ చేసిన మ్యాక్స్‌వెల్‌

బౌలింగ్‌ ప్రాక్టీస్ చేసిన మ్యాక్స్‌వెల్‌

మరోవైపు పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌ ప్రాక్టీసు చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో హోల్కర్‌ స్టేడియంలో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి సొంతగడ్డపై హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించాలనే పట్టుదలతో పంజాబ్ ఉంది.

ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న పంజాబ్

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
David Miller And Marcus Stoinis Sweating It Out In Indore Ahead Of Match KXIP Vs MI.
Please Wait while comments are loading...