స్ఫిన్నర్లపై దాడి: భారత పర్యటనకు కొత్త 'వెపన్'తో వార్నర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత పర్యటన కోసం పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు. ఉపఖండం పిచ్‌లపై సత్తా చాటేందుకు బరువైన బ్యాట్‌ను ఆయుధంగా ఎంచుకున్నాడని 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' ఓ కథనంలో పేర్కొంది.

రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు భారత్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు డేవిడ్ వార్నర్ తన భారత పర్యటనలో మందపాటి బ్లేడ్‌ ఉన్న బ్యాట్‌ను వాడనున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇదే తరహా బ్యాట్‌ని వాడుతున్నట్లు ఆ కథనంలో రాసుకొచ్చింది.

David Warner has a new 'weapon' to counter Indian spinners

వార్నర్‌ గ్యారీ నికోలస్‌ కాబూమ్‌ బ్యాట్‌ను వార్నర్ వాడతాడు. స్వదేశంలో మ్యాచ్‌ల కోసం అతడు ఉపయోగించే బ్యాట్‌ బరువు 1.23 కిలోలు ఉంటుంది. అయితే భారత్‌తో సిరీస్‌ కోసం అతడు సుమారు 1.28 కిలోల బరువున్న బ్యాట్‌ను వాడనున్నాడని తెలిపింది.

ఇది చూసేందుకు సాధారణ బ్యాట్‌లాగే ఉన్నా మధ్య భాగంలో కాస్తంత మందంగా ఉంటుంది. దాంతో బ్యాట్ బరువుగా అనిపిస్తుంది. దానివల్ల ఎక్కువగా స్పిన్‌, లో బౌన్స్‌ అయ్యే బంతుల్ని ఇబ్బంది లేకుండా ఎదుర్కోవచ్చని వార్నర్ భావిస్తున్నాడు.

ఇక 2013లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు 0-4తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2013లో భారత పర్యటనకు వచ్చిన డేవిడ్ వార్నర్ నాలుగు టెస్టుల్లో 24.37 యావరేజి నమోదు చేశాడు. భారత పర్యటనకు వచ్చిన వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
David Warner has started his preparations for the tour of India and the in-form Australian batsman has resorted to using a heavier bat to counter the conditions in the sub-continent.
Please Wait while comments are loading...