రాంచీ టెస్టు: ఆవేశంతో ఊగిపోయిన ఇషాంత్, ఆ ఓవర్‌లో ఏం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

రాంచీ: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు చివరి రోజైన సోమవారం 29వ ఓవర్లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. మూడో టెస్టులో మొదటి నాలుగు రోజులు కూల్‌గా కనిపించిన ఇషాంత్ శర్మ చివరి రోజు ఆటలో మాత్రం కాస్త ఆవేశంగా కనిపించాడు.

రాంచీ టెస్టులో జడేజా అద్భతం: స్మిత్‌ను ఇలా అవుట్ చేశాడు (వీడియో)

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 29వ ఓవర్ తొలి బంతిని వేసేందుకు ఇషాంత్ రాగా చివరి క్షణంలో రెన్‌ షా క్రీజు నుంచి తప్పుకున్నాడు. దాంతో కోపం వచ్చిన ఇషాంత్ చేతిలోని బంతిని వికెట్లకు సమీపంలో విసిరాడు. దీన్ని చూసిన రెన్ షా నవ్వుతూ కనిపించాడు.

Day 5: Ishant Sharma and Matt Renshaw involved in heated argument

ఈ క్రమంలో అవతలి ఎండ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ ఏదో అనబోతే అంతే ఘాటుగా ఇషాంత్ సమాధానమిచ్చాడు. అయితే తాను కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న రీతిలోనే ఇషాంత్ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఈ క్రమంలో అంపైర్‌... కెప్టెన్ కోహ్లీని పిలిచి మాట్లాడాడు.

ఈ క్రమంలో ఇషాంత్ వేసిన ఆ తర్వాత రెండు బంతుల్ని ఎదుర్కొన్న రెన్ షా, నాలుగో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇలా ఇషాంత్ సక్సెస్ కాగా, రెన్ షా ఏదో తిట్టుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఆపై కాసేపటికి స్టీవ్ స్మిత్‌ను జడేజా బౌల్డ్ చేయడంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.

రాంచీ టెస్టు: కోహ్లీని ఎగతాళి చేసిన ఆసీస్ ఆటగాళ్లకు చురకలు

ఈ సిరిస్‌లో తన వివాదాలతో ఇషాంత్ శర్మ బాగా పాపులర్ అయ్యాడు. బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హావభావాలను వ్యంగ్యంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అందులో కెప్టెన్ స్టీవ్ స్మిత్, రెన్ షాలను వారి శైలిలోనే కవ్వించే యత్నం చేశాడు. ఇది అటు అభిమానుల్ని, ఇటు వ్యాఖ్యాతల్ని సైతం అలరించింది. ఎంతలా అంటే ఈ సిరీస్‌కు సంబంధించిన పలువురు కామెంటేటర్లు 'గేమ్ ఫేస్' పేరిట ఛాలెంజ్‌కు దిగేంతలా.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tempers flared again in the ongoing battle between fierce rivals India and Australia with pacer Ishant Sharma and young opener Matt Renshaw getting involved in a heated exchange on day 5 of the 3rd Test here.
Please Wait while comments are loading...