సగటు అభిమానిని వేధించిన చిక్కు ప్రశ్న: ఇద్దరి చేతుల్లో ట్రోఫీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. అయితే టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత ఓ చిక్కు ప్రశ్న అభిమానులను వేధించింది. సిరీస్ గెలిచాం కానీ.. ఇప్పుడు ట్రోఫీ ఎవరు అందుకుంటారు అని సగటు అభిమాని ఎంతగానో ఆలోచించాడు.

నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మొదటి మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలై 0-1తో భారత్ వెనుకబడినా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న తీరు అద్భుతం.

కోహ్లీ స్ధానంలో రహానే కెప్టెన్సీ

బెంగుళూరులో టెస్టులో విజయం సాధించి సిరిస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత రాంచీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ధర్మశాల టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. రాంచీలో జరిగిన మూడు టెస్టులో కోహ్లీ భుజానికి గాయమైంది. దీంతో ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో రహానే కెప్టెన్సీ చేపట్టాడు. చివరి టెస్టుకు కెప్టెన్ కోహ్లీ దూరమైనా జట్టు ఏమాత్రం ఆందోళన చెందలేదు.

స్ఫూర్తిదాయక కెప్టెన్సీతో ఆకట్టుకున్న రహానే

తాత్కాలిక కెప్టెన్ రహానే స్ఫూర్తిదాయక కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ లేని లోటు తెలియకుండా రహానే నేతృత్వంలోని టీమిండియా ధర్మశాల టెస్టులో సమిష్టిగా రాణించి ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ దక్కించుకుంది. దీంతో ట్రోఫీని కోహ్లీ అందుకోవాలా? లేక రహానేనా అన్న సందేహం సగటు అభిమానికి కలిగింది.

కోహ్లీని పిలిచిన హోస్ట్ రవిశాస్త్రి

అయితే మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఉన్న రహానేను పిలిచి విజయంపై అతని అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు హోస్ట్ రవిశాస్త్రి. మ్యాచ్ అనంతరం ట్రోఫీ అతనికి ఇవ్వకుడా కోహ్లీని పిలిచాడు. ట్రోఫీ అందుకునే సమయంలో రహానే కూడా అక్కడే ఉన్నాడు. దీంతో అతన్నే అందుకోవాల్సిందిగా కోహ్లి చెప్పడంతో చివరికి ఇద్దరూ కలిసి క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.

కుల్దీప్‌కు ట్రోఫీ అందించి పక్కకు తప్పుకున్న రహానే

ఇక ట్రోఫీని అందుకున్న రహానే తన కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న కుల్దీప్ యాదవ్ చేతికి ట్రోఫీ అందించి పక్కకు తప్పుకున్నాడు. ధర్మశాల టెస్టులో 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. స్వదేశంలో వరుసగా ఏడు టెస్టు సిరిస్‌లను టీమిండియా కైవసం చేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India defeated Australia by 8 wickets to win the win fourth and final Test to complete what has been a fantastic home season for Indian cricket. The win in the final Test also powered India to reclaim the Border-Gavaskar Trophy.
Please Wait while comments are loading...