దినేశ్ కార్తిక్‌ సెంచరీ: తమిళనాడుదే విజయ్‌ హజారే ట్రోఫీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విజయ్‌ హజారే ట్రోఫీ విజేతగా తమిళనాడు నిలిచింది. బెంగాల్‌ జట్టుతో సోమవారం ఇక్కడి ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో తమిళనాడు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు 47.2 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది.

సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ (120 బంతుల్లో 112; 14 ఫోర్లు) సాయంతో అద్భుత సెంచరీ సాధించాడు. బాబా ఇంద్రజిత్‌ (32)తో కలిసి దినేశ్‌ కార్తీక్‌ ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. బెంగాల్‌ బౌలర్లలో మొహమ్మద్‌ షమీ (4/26), అశోక్‌ దిండా (3/36) ఆకట్టుకున్నారు.

Dinesh Karthik slams ton as Tamil Nadu outplay Bengal to clinch VijayHazare Trophy

అనంతరం 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు 45.5ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో... విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో తమిళనాడు... బంగాల్‌పై 37 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

సుదీప్‌ చటర్జీ (58; 5 ఫోర్లు), మనోజ్‌ తివారి (32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. తమిళనాడు బౌలర్లలో అశ్విన్‌ క్రిస్ట్, మొహమ్మద్, రాహిల్‌ షా రెండేసి వికెట్లు తీయగా... సాయికిశోర్, బాబా అపరాజిత్, విజయ్‌ శంకర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఈ ట్రోఫీని నెగ్గడం తమిళనాడుకిది మూడోసారి. 2008-09, 2009-10ల్లో కూడా బెంగాల్‌పైనే విజయం సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Inspired by a belligerent century from seasoned keeper-batsman Dinesh Karthik, Tamil Nadu outshone Bengal by 37 runs to clinch the domestic 50-over competition, the 2016-17 Vijay Hazare Trophy for the third time at the Feroz Shah Kotla here on Monday.
Please Wait while comments are loading...