న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పట్లో చెత్తగా తినేవాణ్ణి: కోహ్లీ ఫిట్‌నెస్‌పై స్టోరీ

మొదట్లో తాను కూడా ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టిసారించలేదని, టీమిండియా మాజీ కోచ్ డంకన్‌ ఫ్లెచర్‌ ఇచ్చిన విలువైన సలహాలు తనకు ఫిట్‌నెస్‌ విలువ తెలిసిందని కోహ్లి చెప్పాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: విరాట్ కోహ్లీ. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. బ్యాట్స్‌మెన్‌గా ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే మొదట్లో తాను కూడా ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టిసారించలేదని, టీమిండియా మాజీ కోచ్ డంకన్‌ ఫ్లెచర్‌ ఇచ్చిన విలువైన సలహాలు తనకు ఫిట్‌నెస్‌ విలువ తెలిసిందని కోహ్లి చెప్పాడు.

కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించి ఎనిమిదేళ్లు దాటిపోయింది. 2012 వరకు కోహ్లీ ఓ సాధారణ ఆటగాడు. 2012 ఐపీఎల్‌ తర్వాత కోహ్లీ కెరీరే కాదు, అతని జీవన శైలి కూడా పూర్తిగా మారిపోయింది. ఆటగాడిగా రాణించాలంటే ముందు ఫిట్‌గా ఉండాలని కోహ్లీ గుర్తించాడు.

ఆ తర్వాత ఫిట్‌నెస్‌, భోజన అలవాట్లు, రోజువారీ జీవనశైలిపై సీరియ్‌సగా దృష్టిపెట్టాడు. అదే సమయంలో టీమిండియా మాజీ కోచ్ డంకన్ ప్లెచర్ ఇచ్చిన విలువైన సలహాలు తాను పరిపూర్ణమైన క్రికెటర్‌గా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడ్డాయని కోహ్లీ చెప్పాడు.

విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌తో ముగిసిన రెండో టెస్టు విజయం అనంతరం ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది టెలిగ్రాఫ్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ తన ఫిట్‌నెస్‌ గురించి వెల్లడించాడు.

నీలో అపారమైన ప్రతిభ ఉంది

నీలో అపారమైన ప్రతిభ ఉంది

‘‘ఫ్లెచర్‌ ఒకసారి నాతో మాట్లాడుతూ ప్రొఫెషనల్‌ క్రీడల్లోకెల్లా అత్యంత అన్‌ప్రొఫెషనల్‌ గేమ్‌ క్రికెట్టే. నీలో అపారమైన ప్రతిభ ఉంది. ఫిట్‌నెస్‌ కోసం కఠోరంగా శ్రమించాలని మాత్రం నువ్వు భావించడం లేదు. మూడు ఫార్మాట్లలోనూ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదగాలని నువ్వు భావిస్తుంటే మాత్రం ముందుగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టు. శారీరక దారుఢ్యానికి, మానసిక బలానికి సంబంధం ఉంది. మనం శారీరకంగా ఎంత ఫిట్‌గా ఉంటే మానసికంగా అంత బలంగా ఉంటామని చెప్పాడు' అని ఫ్లెచర్‌ తనతో చెప్పాడని విరాట్‌ తెలిపాడు.

జీవనశైలి పూర్తిగా మారిపోయింది2012 ఐపీఎల్ తర్వాత తన

జీవనశైలి పూర్తిగా మారిపోయింది2012 ఐపీఎల్ తర్వాత తన

2012 ఐపీఎల్ తర్వాత తన జీవనశైలి పూర్తిగా మారిపోయిందని కోహ్లీ పేర్కొన్నాడు. ఆ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించానని, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై 180 పరుగుల ప్రదర్శన చేశానని చెప్పాడు. 2012 ఐపీఎల్‌లో కూడా రాణించాలని అనుకున్నానని తెలిపాడు.

2012 ఐపీఎల్ టోర్నీలో బాగా ఇబ్బంది పడ్డా

2012 ఐపీఎల్ టోర్నీలో బాగా ఇబ్బంది పడ్డా

‘బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి ఈ ఐపీఎల్‌లో నా ముద్ర వేయాలనుకున్నా. కానీ ఆటోర్నీలో బాగా ఇబ్బంది పడ్డా. అప్పట్లో నా లోకమే వేరు. నా ట్రైనింగ్‌ చెత్తగా ఉండేది. నా సన్నద్ధత ఏమాత్రం బాగుండేది కాదు. అతిగా తినేవాణ్ని. ఆలస్యంగా పడుకునేవాడిని. రోజులో ఒకట్రెండుసార్లు తాగేవాడిని. దీంతో ఆ టోర్నీలో రాణించలేకపోయాను' అని కోహ్లీ చెప్పాడు.

నన్ను నేను అద్దంలో చూసుకున్నా

నన్ను నేను అద్దంలో చూసుకున్నా

ఆ తర్వాత ఇంటికి వెళ్లి దీని గురించి చాలా సీరియస్‌గా ఆలోచించానని చెప్పాడు. ‘ఇంటికెళ్లిన తర్వాత ఒకరోజు స్నానం చేసి వచ్చి నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కావాలనుకున్నపుడు ఇలా ఉండకూడదని అర్థమైంది. మనలో ఎంత ప్రతిభ అయినా ఉండొచ్చు. కానీ ఒక టెన్నిస్‌ ఆటగాడి లాగా ఫిట్‌నెస్‌ విషయంలో ఎంతో శ్రమించాలి. మూడు ఫార్మాట్లలోనూ రాణించాలంటే ప్రతి రోజూ సాధన అవసరమని అర్థమైంది' అని కోహ్లీ అన్నాడు.

11-12 కేజీలు ఎక్కువగా ఉండేవాడిని

11-12 కేజీలు ఎక్కువగా ఉండేవాడిని

'అప్పట్లో చాలా లావుగా ఉండేవాడిని. ఇప్పుడున్న బరువుతో పోలిస్తే 11-12 కేజీలు ఎక్కువగా ఉండేవాడిని. ఉదయం నుంచే నా జీవన శైలిని పూర్తిగా మార్చేశా. ఏం తినాలి.. ఎలాంటి శిక్షణ తీసుకోవాలనే ప్రణాళిక వేసుకున్నా. జిమ్‌లో రోజూ గంటన్నరకుపైగా గడిపేవాడిని. కొవ్వు పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, కూల్‌ డ్రింక్స్‌, కేక్‌, ఐస్‌క్రీమ్‌లు అన్నీ మానేశా. అప్పటివరకూ ఏదిబడితే అది తిన్న నాకు ఇది కఠినమైన నిర్ణయమే. తొలి రెండు నెలలు చాలా కష్టంగా అనిపించింది. బాగా ఆకలేసేది. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక కప్పుకునే బెడ్‌షీట్‌నైనా తినేయాలని అనిపించేది. కానీ, భరించాను. ఇప్పుడు దాని ఫలితాన్ని ఆస్వాదిస్తున్నాను. శారీరకంగా ఫిట్‌గా ఉండటం వల్ల మానసికంగానూ బలవంతుడినయ్యా. ఈ రెంటికీ సంబంధముంది' అని కోహ్లీ అన్నాడు.

2015 నుంచి ట్రెయినింగ్‌ పద్ధతినే మార్చేశా

2015 నుంచి ట్రెయినింగ్‌ పద్ధతినే మార్చేశా

‘2015 నుంచి ట్రెయినింగ్‌ పద్ధతినే మార్చేశా. క్లీన్‌ అండ్‌ జెర్క్‌, స్నాచ్‌, డెడ్‌ లిఫ్ట్‌ అంశాలను చేర్చా. ఇది నమ్మశక్యంకాని ఫలితాన్నిచ్చింది. కాళ్లలో బలం పెరిగింది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బంతి వెంట పరుగెడుతుంటే నా కాళ్లలో బలం పెరిగిందనే విషయం తెలిసింది. వావ్‌ అనిపించింది. ఇప్పుడు ఈ ట్రైనింగ్‌కు నేను బానిసనయ్యా. ఏడాదిన్నర కాలంగా నా ఆటను మరో స్థాయికి తీసుకెళ్లగలిగాన' అని కోహ్లీ వివరించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X