సిరిస్ నుంచి హమీద్ ఔట్: తిరిగి ఇంగ్లాండ్‌కు పయనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్ యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ హసీబ్‌ హమీద్‌ భారత పర్యటన ముగిసింది. గాయం కారణంగా సిరిస్‌కు దూరమయ్యాడు. దీంతో సిరిస్‌లోని మిగతా రెండు టెస్టుల్లో అతడు ఆడటం లేదు. 19 ఏళ్ల హమీద్ తిరిగి ఇంగ్లాండ్ వెళ్లి పోనున్నాడు.

ఈ మేరకు ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఓ ప్రకటన చేశాడు. మూడో టెస్టు తొలిరోజు బ్యాటింగ్ సందర్భంగా భారత పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన బౌన్సర్ హామీద్ ఎడమ చేతి భుజానికి తగిలింది. దీంతో అతడు గాయపడ్డాడు. భారత పర్యటనలో హమీద్ రెండు అర్ధ సెంచరీలను నమోదు చేశాడు.

మొహాలిలో హీరో పార్ధీవ్: 12ఏళ్లకు అర్ధసెంచరీ, 14ఏళ్లకు తొలి సిక్స్

రాజ్ కోట్ టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హమీద్ గాయంతో బాధపడుతున్నా.. మొహాలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు స్కోరు 200 పరుగుల మార్కుని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మొహాలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా ఓపెనింగ్‌కు రాలేకపోయిన హమీద్ 156 బంతులను ఎదుర్కొని 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

England opener Haseeb Hameed ruled out of rest of the series

ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హామీద్ ప్రారంభం నుంచే నెమ్మదిగా ఆడాడు. 19 బంతులకు ఖాతా తెరిచాడు. ఈ క్రమంలో ఏడో వికెట్‌కు జో రూట్‌తో కలిసి 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మరోవైపు ఆల్ రౌండర్ వోక్స్‌ ఫిట్‌నెస్‌పై మేఘాలు కమ్ముకున్నాయి.

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌‌లో భారత్ పేసర్ షమీ విసిరిన బౌన్సర్‌ వోక్స్‌ హెల్మెట్‌కు బలంగా తగిలింది. వోక్స్ హెల్మెట్ కు ఉన్న నెక్‌గార్డ్ ఎగిరి కిందపడింది. అయితే ఈ బంతికి వోక్స్‌కు ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండో బంతిని కూడా షమీ బౌన్సర్ రూపంలోనే సంధించాడు.

ఫోటోలు: షమీ బౌన్సర్లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెంబేలు

ఈ బంతిని ఆడటంతో తడబడిన వోక్స్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఇంగ్లాండ్ టీమ్ డైరెక్టర్ వోక్స్ గాయం తీవ్రతను పరిశీలిస్తున్నాడు. దీంతో పాటు వోక్స్‌కు మరో గాయం అయినట్టు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
England opener Haseeb Hameed has been ruled out of rest of the series after the youngster suffered a hand injury during the 3rd Test match of the ongoing India-England series.
Please Wait while comments are loading...