అప్పుడు వెటరన్లు, ఇప్పుడు కుర్రాళ్లు: కుక్ వ్యూహం ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: నాలుగేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చి ఇక్కడ ఎదుర్కొన్న జట్టుకు ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టుకి చాలా తేడా ఉందని ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అన్నాడు. మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. మొహాలి టెస్టు ఓటమి అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ మీడియాతో మాట్లాడాడు. 2012లో మేం ఎదుర్కొన్న భారత జట్టు ఎక్కువగా వయసు మళ్లిన ఆటగాళ్లతో నిండి ఉందని చెప్పాడు.

'ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టులోని యువకులకేమో ఉపఖండంలో ఆడిన అనుభవం లేదు. అప్పట్లో (కుక్‌, బెల్‌, పీటర్సన్‌, ప్రయర్‌, అండర్సన్‌, స్వాన్‌, పనేసర్‌) అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారందరికీ ఉపఖండంలో ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు చాలామందికి అనుభవం లేదు' అని కుక్ పేర్కొన్నాడు.

నాకు, రూట్‌కు తప్ప ఎవరికీ అనుభవం లేదు

నాకు, రూట్‌కు తప్ప ఎవరికీ అనుభవం లేదు

'అయితే టాప్ ఆర్డర్‌లో నాకు, రూట్‌కు తప్ప ఎవరికీ ఒకట్రెండు మ్యాచ్‌లకు మించిన అనుభవం లేదు. అదే రెండు జట్లలో తేడా. అయినా గత రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శనే చేశాం. మొహాలి పిచ్‌ను తప్పుగా అంచనా వేశాం. లేదంటే నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడేవాళ్లం. ఈ పిచ్‌ స్పిన్‌కు బాగా సహకరిస్తుందనుకున్నాం' అని కుక్ అన్నాడు.

మొహాలి పిచ్‌ను అంచనా వేయడంలో విఫలం

మొహాలి పిచ్‌ను అంచనా వేయడంలో విఫలం

మొహాలి పిచ్‌ను తమ బ్యాట్స్‌మెన్ అంచనా వేయడంలో విఫలమయ్యారని చెప్పాడు. అదే తమ ఓటమికి ఓ కారణమని కుక్ అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ముంబై పిచ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తామని చెప్పుకొచ్చాడు. భారత్ దూకుడుకి అడ్డుకోవాలంటే నాలుగో టెస్టులో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగుతామన్నాడు.

 ఇంగ్లాండ్ జట్టులో రాణించిన రషీద్

ఇంగ్లాండ్ జట్టులో రాణించిన రషీద్

ఇక లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఈ టెస్టులో ఐదు వికెట్లతో రాణించగా, సీనియర్ స్ఫిన్నర్ బ్యాటీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాడు. ఇదే స్టేడియంలో గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 20 వికెట్లకుగానూ 19 వికెట్లు స్పిన్నర్లే తీసి భారత విజయంలో కీలక పోషించారని అలెస్టర్ కుక్ గుర్తుచేశాడు.

నాలుగో టెస్టులో వ్యూహం మార్చుతాం

నాలుగో టెస్టులో వ్యూహం మార్చుతాం

ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో బెన్ స్టోక్స్ రాణించడం ఒక్కటే తమకు ప్లస్ పాయింట్ అన్నాడు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహంతో ఇప్పటివరకూ ఆడామని కానీ నాలుగో టెస్టులో మరో స్పిన్నర్‌కు అవకాశం కల్పించి భారత్‌ను త్వరగా ఆలౌట్ చేస్తే తమకు విజయావకాశాలు ఉంటాయని కుక్ చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
England were the last team to beat India at home, back in 2012, and Alastair Cook feels the difference is that India's 'Class of 2012' comprised "ageing players" while England's 'Batch of 2016' is full of rookies with little or no experience of playing in the sub continent.
Please Wait while comments are loading...