కోహ్లీ జెర్సీపై ఉన్న మూడు స్టార్లు దేన్ని సూచిస్తాయో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఒప్పొ కొత్త జెర్సీల్లో కోహ్లీసేన గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. రాయల్‌ బ్లూ రంగులో మెరిసిపోతున్న ఈ జెర్సీలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు గీతలు భారత త్రివర్ణ పతాకాన్ని చిహ్నంగా పొందుపరిచారు.

అదే విధంగా జెర్సీకి కుడివైపున్న బీసీసీఐ లోగోపై మూడు నక్షత్రాలను ముద్రించారు. అయితే ఈ మూడు నక్షత్రాలు ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా. ఈ మూడు నక్షత్రాలు దేనిని సూచిస్తున్నాయో తెలుసా. ఈ మూడు నక్షత్రాలు టీమిండియా సాధించిన మూడు వరల్డ్ కప్‌లకు చిహ్నాలు.

 Ever Wondered What Do The Three Stars On Indian Cricket Team’s Jersey Signify?

మైదానంలో ఆటగాళ్లకు స్ఫూర్తి నింపేందుకు గాను ఈ మూడు నక్షత్రాలను జెర్సీలో రూపొందించారు. కాగా, టీమిండియా ఇప్పటివరకు రెండు వన్డే వరల్డ్ కప్‌లను గెలుచుకోగా, ఒక టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. నిజానికి ఈ సంప్రదాయం పుట్‌బాల్‌లో ఎప్పటి నుంచో ఉంది.

బ్రెజిల్‌, ఇటలీ సాకర్‌ జట్ల జెర్సీలపైనా ఇలాగే నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు ఆయా జట్లు సాధించిన ప్రపంచకప్‌ల చిహ్నాలను సూచిస్తుంటాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Every detail on a sport jersey is significant. The number, the colour, the national emblem. A jersey generally represents a player's nationality and it, over time, becomes a part of his/her personality. Like, for example, we are used to watching Virat Kohli in the Indian blue-colour shirt.
Please Wait while comments are loading...