ఫోటోలు: సచిన్ దృష్టిలో ది బెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తాను ఎదుర్కొన్న కెప్టెన్లలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అత్యుత్తమ కెప్టెన్ అని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కితాబిచ్చాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో సచిన్ కొన్ని విషయాలను పంచుకున్నాడు.

అందులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మంచి వ్యూహకర్త అని సచిన్ అన్నాడు. కొన్నిసార్లు అతడి వ్యూహాలు విమర్శలకు తావిచ్చినా, ఆటలో అవన్నీ భాగమేనని సచిన్ చెప్పాడు. ఓ మ్యాచ్‌లో తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆష్లే జైల్స్‌కు బంతినిచ్చి, లెగ్ స్టంప్‌కు వెలుపల వెళ్లేలా నాసిర్ బంతులేయించాడని సచిన్ అన్నాడు.

నాసిర్ ఎంత తెలివిగా ఆలోచిస్తాడో ఇది ఒక ఉదాహరణ అని సచిన్ చెప్పుకొచ్చాడు. బ్యాట్స్‌మెన్ ఒక షాట్ ఆడిన తర్వాత ఫీల్డర్లను ఒక స్థానంలో నాసిర్ నిలకడగా ఉంచడని సచిన్ అన్నాడు. బ్యాట్స్మెన్ ఆడబోయే షాట్‌ను నాసిర్ ముందుగానే అంచనా వేయగలడని సచిన్ అన్నాడు.

ఆ తెలివి నాసిర్ సొంతమన్న సచిన్

ఆ తెలివి నాసిర్ సొంతమన్న సచిన్

అందుకు తగ్గట్టుగానే ఫీల్డర్‌ను మోహరింపజేసే తెలివి నాసిర్ సొంతమని సచిన్ అభినందించాడు. ఇక నాసిర్ హుస్సేన్ గురించి చాలా మందికి తెలియని విశేషం ఏమిటంటే అతడు చెన్నైలో పుట్టి ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

చెన్నైలో పుట్టిన హుస్సేన్ 88 వన్డేలు, 96 టెస్టు లాడాడు

చెన్నైలో పుట్టిన హుస్సేన్ 88 వన్డేలు, 96 టెస్టు లాడాడు

1989 నుంచి 2004 వరకు ఇంగ్లాండ్ జట్టు తరుపున ఆడిన నాసిర్ హుస్సేన్ 88 వన్డేలు, 96 టెస్టు మ్యాచ్‌లాడాడు. టెస్టుల్లో 5764 పరుగులు, వన్డేల్లో 2332 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు ఉన్నాయి. కాగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌పై సచిన్ ప్రశంసలు కురిపించాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్లలో మైఖేల్ క్లార్క్‌ అత్యుత్తమ కెప్టెన్

ఆస్ట్రేలియా కెప్టెన్లలో మైఖేల్ క్లార్క్‌ అత్యుత్తమ కెప్టెన్

తాను ఆడిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో మైఖేల్ క్లార్క్‌ అత్యుత్తమ కెప్టెన్ అని కొనియాడాడు. 2015లో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్‌ను సాధించిన క్లార్క్ ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు మార్క్ టేలర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్‌ల కంటే ఎక్కువ రేటింగ్ సాధించాడని కొనియాడాడు.

అలెన్ బోర్డర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు చిన్నవాడిని

అలెన్ బోర్డర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు చిన్నవాడిని

ఆసీస్ కెప్టెన్లలో మైఖేల్ క్లార్క్‌కే తాను ఎక్కువ మార్కులు వేస్తానని చెప్పాడు. అలెన్ బోర్డర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, తాను చిన్నవాడినని అందువల్ల ఆయన కెప్టెన్సీని తాను అంచనా వేయలేనని తెలిపాడు. మార్క్ టేలర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్‌లు కెప్టెన్‌గా ఉన్న సమయంలో వారి జట్లలో అత్యున్నత స్థాయి ఆటగాళ్లు ఉన్నారన్నాడు.

విన్నర్లు ఉన్నప్పుడు, కెప్టెన్ పాత్ర తగ్గిపోతుంది

విన్నర్లు ఉన్నప్పుడు, కెప్టెన్ పాత్ర తగ్గిపోతుంది

తద్వారా ఆయా కెప్టెన్లు ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నారని సచిన్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పుడు, కెప్టెన్ పాత్ర తగ్గిపోతుందని సచిన్ చెప్పాడం విశేషం. ఆ తర్వాత గ్రేమ్ స్మిత్ రెండో అత్యుత్తమ కెప్టెన్ అని సచిన్ చెప్పాడు. 22 ఏళ్ల వయసులో సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ సారథ్య బాధ్యతలను స్మిత్ చేపట్టాడని, ఆ తర్వాత ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన టీమ్ ను అగ్రగామిగా నిలిపాడని కొనియాడాడు. స్మిత్ కెప్టెన్ అయిన సమయంలో సౌతాఫ్రికా టీమ్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, అలాంటి స్థితి నుంచి టీమ్ ను విజయాల బాట పట్టించాడని తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While Sachin Tendulkar has had the pleasure of playing under some of the finest Indian captains ever including Sourav Ganguly and MS Dhoni, when it comes to naming the best opposition captain, the Master Blaster had a clear choice in former England skipper Nasser Hussain.
Please Wait while comments are loading...