నేవీ జవాన్ నుంచి పాక్ కొత్త హీరోగా: ఎవరీ ఫకార్ జమాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫకార్ జమాన్... ఇప్పుడు పాకిస్థాన్‌లో హీరో. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత బౌలర్లను ఊచకోత కోశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్ తొలి బంతికే పేసర్ బుమ్రా పాక్ ఓపెన‌ర్ ఫ‌క‌ార్ జ‌మాన్‌ను అవుట్ చేశాడు. ఆ సమయంలో ఫకార్ వ్యక్తిగత స్కోరు 3 పరుగులు.

అయితే అది నో బాల్ కావడంతో అతడికి లైఫ్ వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఫకార్ జమాన్ 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేసి పాకిస్థాన్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో పాకిస్థాన్‌లో ఫకార్ జమాన్ రాత్రికి రాత్రే స్టార్ హీరో అయ్యాడు. ఈ క్రమంలో ఫకార్ జమాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఫకార్ జమాన్ సొంత ఊరు మర్దాన్ ద‌గ్గ‌ర ఉన్న క‌త్లంగ్‌. ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ ఇష్టమైన క్రికెటర్. గిల్‌క్రిస్ట్ లాగే ఫకార్ కూడా ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్.

ఇష్టమైన క్రికెటర్ గిల్‌క్రిస్ట్

ఇష్టమైన క్రికెటర్ గిల్‌క్రిస్ట్

గిల్‌క్రిస్ట్ లాగే దూకుడుగా ఆడేందుకు ఇష్ట‌ప‌డుతాడతానని ఓ ఇంటర్యూలో చెప్పాడు. 17 ఏళ్ల వ‌య‌సులో ఫకార్ పాకిస్థాన్ నేవీలో జ‌వానుగా చేరాడు. కానీ అత‌నికి క్రికెట్ అంటే ఇష్టం. నేవీ సెయిల‌ర్‌గా ఉద్యోగం వ‌చ్చినా అత‌నికి అందులో తృప్తి దొర‌క‌లేదు. మంచి జీతం వ‌స్తున్నా ఆ ఉద్యోగాన్ని వదిలేయాల‌ని అనుకున్నాడు. క్రికెట్ మీద ఉన్న ఇష్టంతోనే నేవీ ఉద్యోగానికి వీడ్కోలు పలికాలని నిర్ణయించాడు.

క‌రాచీలోని నేవీ శిక్ష‌ణ కేంద్రంలో ట్రైనింగ్

క‌రాచీలోని నేవీ శిక్ష‌ణ కేంద్రంలో ట్రైనింగ్

క‌రాచీలోని నేవీ శిక్ష‌ణ కేంద్రంలోనూ ఏడాది పాటు ట్రైనింగ్ తీసుకున్న త‌ర్వాత ఆ ఉద్యోగాన్ని వ‌దిలేయాల‌ని అనుకున్నాడు. అయితే నేవ‌ల్ అకాడ‌మీలో క్రికెట్ కోచ్‌ను క‌లిసిన జ‌మాన్ త‌న ఇష్టాన్ని తెలిపాడు. ఈ క్రమంలో కోచ్ అతడికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫ‌కార్ అకాడ‌మీలో టాప్ క్రికెట‌ర్‌గా ఎదిగాడు. ఆ త‌ర్వాత అకాడ‌మీ కోచ్ జ‌మాన్‌ను మ‌రో కోచ్‌కు పరిచయం చేశాడు.

క‌రాచీ అండ‌ర్‌-19, అండ‌ర్‌-23 త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్

క‌రాచీ అండ‌ర్‌-19, అండ‌ర్‌-23 త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్

కొత్త కోచ్ వద్ద మరిన్ని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత నేవీ స‌ర్వీస్ నుంచి ఫకార్‌ను త‌ప్పించారు. అనంతరం అతడు క్రికెట్‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెట్టాడు. క‌రాచీ అండ‌ర్‌-19, అండ‌ర్‌-23 త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఆ టోర్నీలో సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేసిన ఫకార్ ఆ త‌ర్వాత అత‌ను పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌కు ఎంపిక‌య్యాడు. అక్క‌డ కూడా సెంచ‌రీల‌తో సత్తాచాటాడు.

ఫైన‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా

ఖైబ‌ర్ ప్రావిన్సు త‌ర‌పున పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌‌లో ఆడిన జ‌మాన్ తన అద్భుత ప్రదర్శనతో పాక్ జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అతడు పాక్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి వన్డే సెంచరీని నమోదు చేసి ఫైన‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The men were glued to the television screen at Faqir Gul’s house in the Katlang area of Mardan, Khyber Pakhtunkhwa. Soon it was clear. Pakistan’s victory over England was quickly becoming a reality.
Please Wait while comments are loading...