ఫైనల్ పుష్: వాంఖడెలో ముంబై ఆటగాళ్ల జోష్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటలకు జరిగే ఈ ‌మ్యాచ్‌‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో వాంఖడే మైదానంలో ముంబై జట్టు ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీసులో పాల్గొన్నారు.

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌ మహేలా జయవర్ధనే ఆధ్వర్యంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా పిచ్‌ని పరిశీలించిన ఆటగాళ్లు తమ అభిప్రాయాలను కోచ్‌తో పంచుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో మూడోసారి టైటిల్‌ విజేతగా నిలవాలని ముంబై ఆటగాళ్లు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు.

ఈ సీజన్‌లో ముంబైకి నాలుగు పరాజయాలు

ఈ సీజన్‌లో ముంబైకి నాలుగు పరాజయాలు

ఇక తొలిసారి ప్లేఆఫ్‌కి చేరిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఐపీఎల్ టైటిల్‌‌ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సీజన్‌లో ముంబైకి నాలుగు పరాజయాలు మాత్రమే ఎదురుకాగా ఇందులో రెండు సార్లు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ చేతిలోనే ఓటమి పాలైంది.

పూణెపై ప్రతీకారం

పూణెపై ప్రతీకారం

దీంతో ఈసారి ఎలాగైనా పూణెపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ బెర్తు దక్కించుకున్న తొలి జట్టుగా నిలవాలని ముంబై భావిస్తోంది. దీంతో మంగళవారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

కీలక పోరులో బలంగా కనిపిస్తోన్న ముంబై జట్టు

కీలక పోరులో బలంగా కనిపిస్తోన్న ముంబై జట్టు

ఈ కీలక పోరులో ముంబై జట్టే కాస్త బలంగా కనిపిస్తోంది. లెండిల్‌ సిమన్స్‌, కీరన్‌ పోలార్డ్‌, పార్థివ్‌ పటేల్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లతో ముంబై బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేయాలంటే పూణె శ్రమించాల్సిందే.

బెన్‌ స్టోక్స్‌ లేకుండానే పూణె బరిలోకి

బెన్‌ స్టోక్స్‌ లేకుండానే పూణె బరిలోకి

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పుణె ప్లేఆఫ్స్‌కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన బెన్‌ స్టోక్స్‌ లేకుండానే పూణె బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా పైనల్‌కు చేరే అవకాశం ఉండటంతో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశాలున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Final push ahead of the Qualifier at the Wankhede and our boys gave their all!
Please Wait while comments are loading...