‘డబుల్’ ధమాకా: డోంట్ మిస్ సూపర్ సండే! భారత్-పాక్ ఫైనల్, సెమీ ఫైనల్

Subscribe to Oneindia Telugu

లండన్: భారత్, పాక్ అభిమానులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు రేపటి ఆదివారం సూపర్ సండేగా మారిపోయింది. ఎప్పుడూ అంచనాలకు మించి సాగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్నాయంటే ఎక్కడా లేని ఆసక్తి మొదలైంది అభిమానుల్లో. దాదాపు ఏ క్రికెట్ అభిమాని కూడా ఈ మ్యాచ్ మిస్ కావాలని అనుకోడు.

ట్రోఫీపై కన్నేసిన భారత్

ట్రోఫీపై కన్నేసిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఓసారి ఆ జట్టును ఓడించిన భారత్.. ఇప్పుడు ఫైనల్లో కూడా విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తోంది.

ప్రతీకారం తీర్చుకుంటామని పాక్

ప్రతీకారం తీర్చుకుంటామని పాక్

పాక్ జట్టు కూడా తొలి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామనే చెబుతోంది. ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఇది టీమిండియాకు కలిసి వచ్చే మైదానం కావడం గమనార్హం.

ఇటు క్రికెట్.. అటు హాకీ..

ఇటు క్రికెట్.. అటు హాకీ..

ఇది ఇలా ఉండగా, భారత్, పాకిస్థాన్ హాకీ జట్లు కూడా ఇంగ్లాండ్‌లోనే ఉన్నాయి. లండన్‌లో జరిగే పురుషుల హాకీ ప్రపంచ కప్ లీగ్(హెచ్‌డబ్ల్యూఎల్) సెమీ ఫైనల్స్‌లో ఆదివారం రోజే ఈ రెండు జట్లూ తలపడటం విశేషం. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30గంటలకు ప్రారంభం కానుంది.

అభిమానులకే పండగే..

అభిమానులకే పండగే..

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాక్ మ్యాచ్ మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్1, హెచ్ డీ1, హాట్‌స్టార్, డీడీ నేషనల్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఓ వైపు ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్, మరో వైపు హాకీ టోర్నీలో సెమీ ఫైనల్లో దాయాది దేశాల మ్యాచ్‌లు క్రికెట్, హాకీ అభిమానులకు పండగే అన్నమాట.

అద్భుతాలు జరిగితే తప్ప..

అద్భుతాలు జరిగితే తప్ప..

సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టుపై సునాయాస విజయం సాధించిన టీమిండియా ఫైనల్లో పాక్ జట్టును మరోసారి ఓడించి ట్రోఫీని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. అదే సమయంలో పాకిస్థాన్.. ఇంగ్లాండ్‌ను సెమీఫైనల్లో కష్టమ్మీద ఓడించి ఫైనల్ చేరింది. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఫైనల్ మ్యాచ్‌లో అనుకోని అద్భుతాలు జరిగే తప్ప పాక్ గెలిచే అవకాశం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tomorrow (June 18) is an unmissable day in London for India and Pakistan sports fans. There are two contests between the arch rivals in the same city.
Please Wait while comments are loading...