30 ఏళ్ల తర్వాత: 2-0తో సిరిస్ క్లీన్ స్వీప్ చేసిన కివీస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పాకిస్థాన్‌తో స్వదేశంలోజరిగిన రెండు టెస్టుల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఉత్కంఠ విజయం నమోదు చేసింది. హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ పాకిస్థాన్‌పై 138 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో 30 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ తొలి టెస్ట్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న ఘనతను నమోదు చేసింది. చివరి రోజైన మంగళవారం 369 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 92.1 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటైంది.

First time in 30 years: Kiwis eye rare series win over Pakistan

1985 అనంతరం పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ గెలవడం కివీస్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. పాక్ ఓపెనర్లు ఓపెనర్లు సమీ అస్లామ్ (91), అజహర్ అలీ (58) అద్భుత ఆటతీరుతో తొలి వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసినా పాక్‌కు ఓటమి తప్పలేదు.

టీ విరామానికి ఒక వికెట్‌ను కోల్పోయి 158 పరుగులతో పాక్ పటిష్టంగా కనిపించింది. ఈ సమయంలో 204 బంతుల్లో 211 పరుగులు చేయాల్సి ఉంది. రెండు సెషన్లలో ఒక వికెట్ కోల్పోయిన పాక్, ఇక మిగిలిన ఒక సెషన్‌లో నిలబడటం పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు.

కానీ చివరి సెషన్‌లో మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది. చివరి సెషన్‌లో కివీస్ బౌలర్లు ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టారు. దీంతో కివీస్‌తో రెండో టెస్టులో 130 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. చివరి 8 వికెట్లను కేవలం 49 పరుగుల వ్యవధిలోనే పాక్ కోల్పోయి పరాజయం పాలైంది.

చివరి మూడు వికెట్లూ ఒకే స్కోరు (230) వద్ద కోల్పోవడం విశేషం. కివీస్ బౌలర్ వాగ్నర్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే చివరి మూడు వికెట్లు తీశాడు. ఇక టిమ్ సౌతీ, సాన్‌ట్నర్‌లకు తలో రెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 271 పరుగులు చేయగా, పాక్‌ 216 పరుగులకు ఆలౌటైంది.

కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను 313/5 వద్ద డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 230 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను కివీస్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ ఓటమితో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ రెండు నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan entered the two-match Test series against New Zealand as favourites but following a hapless display by the visitors in the first Test, where the hosts won by eight wickets, that tag has been reversed; now Pakistan are the underdogs.
Please Wait while comments are loading...