ఒలింపిక్స్‌లో క్రికెట్‌: ఆడాలా వద్దా? అనే దానిపై బీసీసీఐతో సీఓఏ భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పలు కీలక అంశాలపై చర్చించేందుకు గాను బుధవారం బీసీసీఐ ఉన్నతాధికారులతో బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశం కానుంది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఒకవేళ క్రికెట్‌ను చేరిస్తే ఆడాలా వద్దా? అనే దానిపైతో పాటు దేశవాళీ క్రికెటర్ల వేతనాల పెంపు లాంటి అంశాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

మరోవైపు ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో వెలుగుచూసిన ఆర్థిక అవకతవకలపై డెలాయిట్‌ సంస్థ ఇచ్చిన నివేదికతో పాటు తొమ్మిది అంశాలు అజెండాలో ఉన్నాయి. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందునుంచీ కూడా బీసీసీఐ ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

బీసీసీఐ స్వయం ప్రతిపత్తి పోతుంది

బీసీసీఐ స్వయం ప్రతిపత్తి పోతుంది

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేరిస్తే బీసీసీఐ స్వయం ప్రతిపత్తి పోతుందన్న ఉద్దేశంలో బోర్డులో చాలా మంది ఒలింపిక్స్‌లో క్రికెట్‌‌ను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కూడా సీఓఏ దృష్టి సారించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ ఉన్నా బీసీసీఐ తమ జట్టును పంపించడం లేదు. ఒక్క 1998 కామన్వెల్త్‌ క్రీడలకు మాత్రం టీమిండియాను పంపింది.

Champions Trophy 2017: Bangladeshi Fans Insult Team India and Indian Flag | Oneindia Telugu
జస్టిస్ లోధా సిఫారసులను అమలుపై కూడా

జస్టిస్ లోధా సిఫారసులను అమలుపై కూడా

జస్టిస్ లోధా సిఫారసులను అమలు చేయడంలో ఎదురవుతున్న పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై కూడా కమిటీ చర్చించనుంది. దేశవాళీలో అన్ని విభాగాల ఆటగాళ్లతోపాటు అధికారులు, సహాయ సిబ్బంది జీతాల పెంచాలన్న ప్రతిపాదనపై సీఓఏ దృష్టి సారించనుంది. 2007 తర్వాత దేశవాళీ ఆటగాళ్లకు ఇచ్చే జీతాలను సవరించలేదు.

హర్షాబోగ్లే పేరు ఉందా? లేదా? అన్నది సస్పెన్స్‌

హర్షాబోగ్లే పేరు ఉందా? లేదా? అన్నది సస్పెన్స్‌

మరోవైపు స్వదేశంలో జరిగే సిరీస్‌ల కోసం కొంత మంది కామెంటేటర్లను ఎంపిక చేసిన బోర్డు దానికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అయితే ఇందులో హర్షాబోగ్లే పేరు ఉందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్‌కు సంబంధించిన బకాయిల చెల్లింపుపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

సమావేశంలో అజహరుద్దీన్ నిధులపై చర్చ

సమావేశంలో అజహరుద్దీన్ నిధులపై చర్చ

గత 17 ఏళ్లుగా పెన్షన్‌తో పాటు వన్‌టైమ్ ఎక్స్‌గ్రేషియా కింద బోర్డు నుంచి అజహరుద్దీన్‌ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఐదేళ్ల క్రితం ఇచ్చిన తీర్పును అనుసరించి తనకు రావాల్సిన నిధులపై సీఓఏకు అజహరుద్దీన్‌ సమాచారమిచ్చాడు. సీవోఏ సమావేశంలో అజహరుద్దీన్‌ పెండింగ్ బకాయిల అంశం చర్చకు రానుంది. ప్రస్తుతం అజహరుద్దీన్‌‌పై ఎలాంటి నిషేధం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BCCI’s stand on India’s Olympic participation in case of cricket’s inclusion and revision of pay structure in the domestic circuit will top the agenda when the Committee of Administrators (COA) meets the Board’s top office-bearers, here on Wednesday.
Please Wait while comments are loading...