అలా మాట్లాడొచ్చా!: కోహ్లీ తీరుపై ఆసీస్‌ మాజీల అసంతృప్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. ఈ సిరిస్ ఎన్నో వివాదాలు, విద్వేషాలతో ఉత్కంఠభరితంగా ముగిసింది. 2-1తేడాతో సిరిస్‌ను కైవసం చేసుకున్న అనంతరం ధర్మశాలలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియన్లు ఇకపై తమకు స్నేహితులు కారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఈ విషయంలో అతడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికారు. కోహ్లీ వ్యాఖ్యలను ఆసీస్ బ్యాటింగ్‌ దిగ్గజం మార్క్‌ టేలర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. కోహ్లీ మరింతగా ఎదగాల్సిన అవసరముందని సూచించాడు.

లీగ్‌ల్లో కలిసి ఆడుతున్నారు

లీగ్‌ల్లో కలిసి ఆడుతున్నారు

'ఈరోజుల్లో క్రికెటర్లు లీగ్‌ల్లో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. అలాంటపుడు ఏదైనా మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో కక్షలు పెంచుకోవడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవిషయంలో అప్రమత్తంగా ఉండాలి. మ్యాచ్‌లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని దాటుకుని వెళ్లిపోయేలా ఎదగాలి' అని మార్క్‌ టేలర్‌ అన్నాడు.

క్రీడాస్ఫూర్తి ముఖ్యం

క్రీడాస్ఫూర్తి ముఖ్యం

ఆటలో పరిణామాలు, జయాపజయాలు ఎలా ఉన్నా క్రీడాస్ఫూర్తి వ్యవహరించడం ముఖ్యమని వైడ్‌ వరల్డ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ కోసం రాసిన తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్‌ జోన్స్‌, మాజీ ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ లాయిడ్‌ సైతం కోహ్లీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

స్నేహితులను చేసుకోవడం కూడా భాగమే

కోహ్లీ వ్యాఖ్యల్లో విజ్ఞత కనిపించడం లేదని పేర్కొన్నారు. 'ఈ గొప్ప క్రీడలో గెలుపోటములే కాదు.. ఆటలో స్నేహంగా మసులుకోవడం, స్నేహితులను చేసుకోవడం కూడా భాగమే' అని డీన్ జోన్స్‌ పేర్కొన్నారు. కోహ్లీ వ్యాఖ్యలు నిరాశ కలిగించాయని ఆస్ట్రేలియా కోచ్‌ డారెన్‌ లీమన్‌ చెప్పాడు.

సచిన్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి

సచిన్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి

ఇక మైదానంలో ఎలా వ్యవహరించాలనే దానిపై లెజండరీ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ నుంచి కోహ్లీ పాఠాలు నేర్చుకోవాలని వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం డేవిడ్‌ లాయిడ్‌ సూచించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Legendary Australia batsman Mark Taylor and several other veteran cricketers have denounced India skipper Virat Kohli's comments that the spiteful Test series has ended his friendship with the Australians.
Please Wait while comments are loading...