10వ టైటిల్: ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన నాదల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్లే కోర్టు రారాజు తనకు తిరుగు లేదని రఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచాడు. ఈ విజయంతో పదిసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరోవైపు అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

నాలుగో సీడెడ్‌గా బరిలోకి దిగిన రఫెల్ నాదల్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన వావ్రింకాపై 6-2, 6-3, 6-1 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. పైనల్‌లో రఫెల్ నాదల్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రెండేళ్ల విరామం తర్వాత తిరిగి నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచాడు.

French Open: 'King of Clay' Rafael Nadal wins record 10th title

గత 12 సంవత్సరాలుగా రొనాల్డ్ గారొస్‌లో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు. 2005-09 మధ్య కాలంలో రఫెల్ నాదల్ నాలుగు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచాడు. ప్రెంచ్ ఓపెన్ ఎరాలో 10 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఒకే ఒక్క ఆటగాడిగా నాదల్ రికార్డు సృష్టించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'King of Clay' Rafael Nadal bagged his record 10th French Open title as he defeated thrid-seeded Stanislas Wawrinka in the final at Roland Garros.
Please Wait while comments are loading...