వాళ్లు నా ఫ్రెండ్స్ కారు: ఆస్ట్రేలియన్లతో స్నేహం ముగిసిందన్న కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ సిరిస్‌లో ఆసీస్ ఆటగాళ్ల తీరుతో కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిగిపోయాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇక ఏ మాత్రం తనకు ఫ్రెండ్స్ కాద‌ని కోహ్లి తేల్చిచెప్పాడు. ఈ సిరిస్‌కు ముందు ప్రత్యర్ధి జట్టులో తనకు మంచి స్నేహితులు ఉన్నారని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు అనంతరం కోహ్లీ తాను ఆ విధంగా అనుకోవడం లేదని తేల్చి చెప్పేశాడు. ధర్మశాల టెస్టు అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. సిరీస్‌కు ముందు స్మిత్ అండ్ టీమ్ మైదానం బ‌య‌ట ఫ్రెండ్సే అని చెప్పారు క‌దా.. ఇప్ప‌టికీ అలాగే భావిస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా కోహ్లీ స్పందించాడు.

'లేదు అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా మారిపోయింది. నేను వాళ్ల‌ను స్నేహితులే అనుకున్నాను. మైదానంలో ఉద్రిక్తత పరిస్థితులు స‌హ‌జ‌మే అనుకున్నాను కానీ నేను చెప్పింది త‌ప్పు. వాళ్లు నా స్నేహితుల‌ని ఎప్ప‌టికీ చెప్ప‌ను' అని కోహ్లీ అన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు, మీడియా తనను టార్గెట్ చేసినా పట్టించుకోనని ఇంతక ముందు కోహ్లీ అన్న సంగతి తెలిసిందే.

సడన్‌గా కోహ్లీ ఇలా

అయితే సడన్‌గా కోహ్లీ ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సిరిస్‌లో డీఆర్ఎస్ ఇరు దేశాల మధ్య తీవ్ర దుమారాన్ని లేపింది. బెంగుళూరు టెస్టులో డీఆర్ఎస్ రివ్యూ కోసం కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసిన సంగతి తెలిసిందే. దీనిపై విరాట్ కోహ్లీ కాస్తంత ఘాటుగానే స్పందించాడు.

కోహ్లీని టార్గెట్ చేసిన ఆసీస్ మీడియా

కోహ్లీని టార్గెట్ చేసిన ఆసీస్ మీడియా

బెంగుళూరు టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లతో పాటు అక్కడి మీడియా కోహ్లీని టార్గెట్ చేసింది. కోహ్లీని జంతువులతో పోల్చడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా పోల్చింది. దీనికి తోడు సారీ ఎలా చెప్పాలో కోహ్లీకి తెలియ‌ద‌నుకుంటా అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ స‌ద‌ర్లాండ్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే.

అసహనానికి గురైన కోహ్లీ

అసహనానికి గురైన కోహ్లీ

ఇలా ఈ సిరిస్‌లో కోహ్లీని లక్ష్యంగా చేసుకుని ఆసీస్ ఆటగాళ్లతో పాటు ఆసీస్ మీడియా వార్తా కథనాలను ప్రచురించడంతో కోహ్లీ మరింత అసహనానికి గురయ్యాడు. ఎవ‌రైనా మ‌మ్మ‌ల్ని వెక్కిరించినా, రెచ్చ‌గొట్టినా మాట‌తోనూ, ఆట‌తోనూ వెంట‌నే తిప్పి కొడ‌తామ‌ని కోహ్లీ కూడా ఘాటుగా స్పందించాడు.

ఘాటుగా స్పందించిన కోహ్లీ

ఘాటుగా స్పందించిన కోహ్లీ

చాలా మంది కొన్ని విషయాలను అంత తేలిగ్గా జీర్ణం చేసుకోలేరు. కానీ మేం మాత్రం బాగానే చేసుకుంటాం, అంత‌కుమించే తిరిగి ఇస్తామ‌ని కోహ్లీ అన్నాడు. ఇక తనను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన ఆసీస్ మీడియాపై కూడా కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

2-1 తేడాతో సిరిస్ భారత్ కైవసం

2-1 తేడాతో సిరిస్ భారత్ కైవసం

'కొంద‌రు ఇంట్లో కూర్చొని లేని క‌థ‌నాల‌ను వండి వారుస్తుంటారు. మైదానంలో ఇలాంటి పరిస్థితుల‌ను వాళ్లు ఎప్పుడూ ఎదుర్కోరు. ఇంట్లో కూర్చొని నోటికొచ్చింది రాయ‌డం చాలా తేలిక‌. మైదానంలో ఆడితే తెలుస్తుంది' అని కోహ్లీ అన్న సంగతి తెలిసిందే. ధర్మశాల టెస్టులో ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ దక్కించుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The four-match Test series between India and Australia is over but the supply of argy-bargy is not. Virat Kohli, in the post-match press conference after India clinched the Border-Gavaskar Trophy beating Steve Smith and Co by 8 wickets in Dharamsala, indicated that his friendship and trust in the Australian side is over.
Please Wait while comments are loading...