క్రికెటర్ల జీతాలు 'డబుల్' హైక్: రూ. 2 కోట్లు క్లబ్‌లో ఏడుగురు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత జట్టు ఆటగాళ్ల వార్షిక వేతనాలను బీసీసీఐ సవరించింది. సవరించిన వార్షిక వేతనాలను బీసీసీఐ పాలనా కమిటీ సభ్యులు బుధవారం ప్రకటించారు. మొత్తం 32 మంది ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టుని దక్కించుకున్నారు. దీంతో సవరించిన వేతనాల ప్రకారం ఏ గ్రేడ్ కాంట్రాక్టు ఆటగాళ్లకు రూ. 2 కోట్లు వేతనంగా లభించనుంది.

ఇక బీ గ్రేడ్ ఆటగాళ్లకు కోటి రూపాయలు వేతనంగా లభించనుంది. సీ గ్రేడ్ కాంట్రాక్టు ఆటగాళ్లకు రూ.50 లక్షలు వేతనంగా లభించనున్నాయి. ఏ గ్రేడ్ ఆటగాళ్ల జాబితాను 4 నుంచి 7కు బీసీసీఐ పెంచింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ, అశ్విన్, పుజారా, జడేజా, రహానే, మురళీ విజయ్‌లున్నారు.

గ్రేడ్ ఏ జాబితాలో కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రహానే, అశ్విన్‌లు తమ స్ధానాలను తిరిగి దక్కించుకున్నారు. కొత్తగా జడేజా, మురళీ విజయ్, పుజారాలు వచ్చి చేరారు. ఇక బీ గ్రేడ్ జాబితాలో యువరాజ్ సింగ్, మహమ్మద్ షమీ, రోహిత్ శర్మలు ఉన్నారు.

Full list of BCCI's contracted players for 2017; Retainer amounts doubled

సీ గ్రేడ్ జాబితాలో శిఖర్ ధావన్ చోటు దక్కించుకున్నాడు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆటగాళ్ల వార్షిక వేతనాలు డబుల్ అవడం విశేషం. కాగా, గత కొంత కాలంగా జట్టులో చోటు దక్కించుకోవడానికి ఇబ్బంది పడుతున్న వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు బీసీసీఐ మొండి చెయ్యి చూపింది.

బీసీసీఐ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా నుంచి భజ్జీని సీఓఏ తప్పించింది. ఇక టెస్టు క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు కింద రూ. 15 లక్షలు, వన్డేల్లో రూ. 6 లక్షలు, టీ20ల్లో రూ. 3లక్షలుగా చేసింది. భారత అండర్ 19 జట్టుకు విశేష సేవలందించి ఇటీవలే మరణించిన రాజేష్ సావంత్ భార్య సంధ్యకు రూ. 15 లక్షలు ఇవ్వాలని బీసీసీఐ తెలిపింది.

సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా:

గ్రేడ్ ఏ (రూ. 2 కోట్లు) - ఏడుగురు ఆటగాళ్లు

1. విరాట్ కోహ్లీ
2. మహేంద్ర సింగ్ ధోనీ
3. రవిచంద్రన్ అశ్విన్
4. ఛటేశ్వర పుజారా
5. రవీంద్ర జడేజా
6. రహానే
7. మురళీ విజయ్‌

గ్రేడ్ బీ (రూ. కోటి) - 9 మంది ఆటగాళ్లు

1. రోహిత్ శర్మ
2. కేఎల్ రాహుల్
3. భువనేశ్వర్ కుమార్
4. మహమ్మద్ షమీ
5. ఇషాంత్ శర్మ
6. ఉమేశ్ యాదవ్
7. వృద్ధిమాన్ సాహా
8. జస్ ప్రీత్ బుమ్రా
9. యువరాజ్ సింగ్

గ్రేడ్ సీ (రూ. 50 లక్షలు) - 16 మంది ఆటగాళ్లు

1. శిఖర్ ధావన్
2. అంబటి రాయుడు
3. అమిత్ మిశ్రా
4. మనీష్ పాండే
5. అక్షర పటేల్
6. కరుణ్ నాయర్
7. హార్ధిక్ పాండ్యా
8. ఆశిష్ నెహ్రా
9. కేదార్ జాదవ్
10. యజువేంద్ర చాహాల్
11. పార్దీవ్ పటేల్
12. జయంత్ యాదవ్
13. మన్దీప్ సింగ్
14. ధావల్ కులకర్ణి
15. శ్రద్ధాల్ ఠాకూర్
16. రిషబ్ పంత్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Board of Control for Cricket in India (BCCI) today (March 22) announced annual players' contracts, doubling the retainer amounts across all three categories. A total of 32 cricketers have been given central contracts.
Please Wait while comments are loading...