ఛాంఫియన్స్ ట్రోఫీ: 15 మందితో కూడిన జాబితాలో గంగూలీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పాటు సంజయ్ మంజ్రేకర్ భారత్ తరుపు నుంచి కామెంటేటర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీసీ 15 మందితో కూడిన కామెంటేటర్ల జాబితాను విడుదల చేసింది.

ఇంగ్లాండ్‌లో జూన్‌ 1-18 మధ్యన ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గంగూతో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ కూడా కామెంటరీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక బెండ్రన్‌ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్‌), కుమార సంగక్కర (శ్రీలంక), గ్రేమ్‌స్మిత్‌ (దక్షిణాఫ్రికా)లు తొలిసారిగా కామెంటరీ వినిపించనున్నారు.

ప్రస్తుతం కామెంటేటర్లుగా దూసుకుపోతున్నషేన్‌వార్న్‌, మైకేల్‌ స్లాటర్‌, నాసర్‌ హుస్సేన్‌, సంజయ్‌ మంజ్రేకర్‌, ఇయాన్‌ బిషప్‌, రమీజ్‌ రాజా తదితరులు ఛాంపియన్స్‌ ట్రోఫీకి కామెంటరీ చేయనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే 15 మ్యాచ్‌‌లను ఐసీసీ టీవీ లైవ్ కవరేజి ఇవ్వనుంది.

Full list of commentators for ICC Champions Trophy 2017

ఈ సందర్భంగా మెక్‌కల్లమ్, రికీ పాంటింగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. తొలి మ్యాచ్‌లో భాగంగా జూన్ 1వ తేదీన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో కామెంటేటర్ల జాబితా:
1. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
2. కుమార్ సంగక్కర (శ్రీలంక)
3. గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా)
4. బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్)
5. మైఖేల్ ఆథర్టన్ (ఇంగ్లాండ్)
6. నాజర్ హుస్సేన్ (ఇంగ్లాండ్)
7. సౌరవ్ గంగూలీ (ఇండియా)
8. సంజయ్ మంజ్రేకర్ (భారతదేశం)
9. షాన్ పొల్లాక్ (దక్షిణాఫ్రికా)
10. మైఖేల్ స్లేటర్ (ఆస్ట్రేలియా)
11. ఇయాన్ బిషప్ (వెస్టిండిస్)
12. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)
13. సైమన్ డౌల్ (న్యూ జేఅలాండ్)
14. రమీజ్ రాజా (పాకిస్తాన్) 1
5. అక్తర్ ఆలీ ఖాన్ (బంగ్లాదేశ్)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former captain Sourav Ganguly and Sanjay Manjrekar are the two Indians part of the 15-man TV commentary panel for the ICC Champions Trophy 2017 in England in June.
Please Wait while comments are loading...