న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

33వ కెప్టెన్‌గా రహానే: టెస్టు కెప్టెన్ల పూర్తి జాబితా

ధర్మశాల వేదికగా భారత్, ఆసీస్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చివరి టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. దీంతో జట్టు బాధ్యతలను రహానేకి

By Nageshwara Rao

హైదరాబాద్: ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చివరి టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. దీంతో జట్టు బాధ్యతలను రహానేకి అప్పగించారు.

భార‌త టెస్టు జట్టు త‌ర‌పున కెప్టెన్సీ చేపట్టిన 33వ టెస్ట్ ప్లేయ‌ర్‌గా ర‌హానే నిలిచాడు. కెప్టెన్ వేసుకునే బ్లేజ‌ర్ దుస్తుల్లో ర‌హానే టాస్ వేసేందుకు స్టేడియంలోకి వచ్చాడు. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. కోహ్లీ స్ధానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు.

Full list of India's Test captains after Ajinkya Rahane joins list at 33rd

ఇక పేసర్ ఇషాంత్‌ శర్మ స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్‌కు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కాగా, కెప్టెన్‌గా రహానేకు కూడా తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. మొట్టమొదటి సారి టెస్టు మ్యాచ్‌కి ధర్మశాల ఆతిథ్యమిస్తోంది.

ఇదిలా ఉంటే 2011 నవంబర్‌ నుంచి 54 టెస్టుల తర్వాత కోహ్లీ లేకుండా టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. సచిన్ టెండూల్కర్ తర్వాత టీమిండియాకు కెప్టెన్‌గా నాయకత్వం వహించిన ముంబై ఆటగాడు రహానే కావడం విశేషం.

అంతక ముందు పాలీ ఉమిగ్రర్, నారీ కాంట్రాక్టర్, జీఎస్ రామ్ చంద్, అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, దిలిప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రిలు ముంబై నుంచి భారత జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు.
1932లో టీమిండియా టెస్టు జట్టుకు తొలి కెప్టెన్‌గా కల్నల్ సీకే నాయుడు నాయకత్వం వహించారు.

టీమిండియా టెస్టు జట్టుకు కెప్టెన్ల పూర్తి జాబితా (33):

1. CK Nayudu 1932-34 (4 Tests)
2. Maharajah of Vizianagram 1936 (3)
3. Nawab of Pataudi 1946 (3)
4. Lala Amarnath 1947-52 (15)
5. Vijay Hazare 1951-53 (14)
6. Vinoo Mankad 1955-59 (6)
7. Ghulam Ahmed 1955-59 (3)
8. Polly Umrigar 1955-58 (8)
9. Hemu Adhikari 1959 (4)
10. Datta Gaekwad 1959 (4)
11. Pankaj Roy 1959 (1)
12. Gulabrai Ramchand 1959-60 (5)
13. Nari Contractor 1960-62 (12)
14. Mansur Ali Khan 1962-75 (40)
15. Chandu Borde 1967 (1)
16. Ajit Wadekar 1971-74 (16)
17. Srinivas Venkataraghavan 1974-79 (5)
18. Sunil Gavaskar 1976-85 (47)
19. Bishan Singh Bedi 1976-78 (22)
20. GR Viswanath 1980 (2)
21. Kapil Dev 1983-87 (34)
22. Dilip Vengsarkar 1987-89 (10)
23. Ravi Shastri 1988 (1)
24. Kris Srikkanth 1989 (4)
25. Mohammad Azharuddin 1990-99 (47)
26. Sachin Tendulkar 1996-2000 (25)
27. Sourav Ganguly 2000-05 (49)
28. Rahul Dravid 2003-07 (25)
29. Virender Sehwag 2005-12 (4)
30. Anil Kumble 2007-08 (14)
31. MS Dhoni 2008-2014 (60)
32. Virat Kohli 2014 to present (26)
33. Ajinkya Rahane 2017 (1)

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X