టీమిండియా శ్రీలంక పర్యటన ఖరారు: పూర్తి షెడ్యూల్ ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. ఈ టోర్నీ అనంతరం టీమిండియా వెస్టిండిస్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. జూన్‌ 23 నుంచి ప్రారంభంకానున్న వెస్టిండిస్ పర్యటన జులై 9తో ముగియనుంది.

వెస్టిండిస్ పర్యటన ముగిసిన తర్వాత 10 రోజుల విరామం అనంతరం టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 21, 22న జరిగే వార్మప్ మ్యాచ్‌లతో శ్రీలంక పర్యటన ప్రారంభమవుతుంది. లంక పర్యటనలో టీమిండియా ఆతిథ్య జట్టుతో భారత్‌ 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.

దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. జులై 26 నుంచి సెప్టెంబరు 6 మధ్య ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 2015లో భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Full schedule of India's tour of Sri Lanka 2017

పూర్తి షెడ్యూల్‌ వివరాలు:
వార్మప్‌ మ్యాచ్‌లు: జులై 21, 22 10 AM (IST)

టెస్టులు (10 AM (IST) గంటలకు ప్రారంభం)
మొదటి టెస్టు: జులై 26-30(క్యాండీ)
రెండో టెస్టు: ఆగస్టు 4-8(గాలే)
మూడో టెస్టు: ఆగస్టు 12-16(కొలంబో)

వన్డేలు (2.30 PM (IST) గంటలకు ప్రారంభం)
తొలి వన్డే: ఆగస్టు 20
రెండో వన్డే: ఆగస్టు 24
మూడో వన్డే: ఆగస్టు 27
నాలుగో వన్డే: ఆగస్టు 30
ఐదో వన్డే: సెప్టెంబరు 3

ఏకైక టీ20: సెప్టెంబరు 6 (7 PM (IST) గంటలకు ప్రారంభం)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team India under the leadership of Virat Kohli will embark upon a grueling tour of Sri Lanka after returning from their short limited-overs' series in West Indies.
Please Wait while comments are loading...