2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ‘ఫిక్స్‌’?: స్పందించిన గంభీర్, నెహ్రా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగ చేసిన ఆరోపణలపై అప్పటి వరల్డ్‌కప్‌ సాధించిన జట్టులో సభ్యులుగా గౌతమ్‌ గంభీర్‌, ఆశీష్‌ నెహ్రా కొట్టిపారేశారు. అతడు చేసిన ఆరోపణలకు గాను ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు.

'రణతుంగ ఆరోపణలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో గౌరవం పొందిన రణతుంగ నోటి వెంట అలాంటి వ్యాఖ్యలు రావడం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ఆయన చేసిన ఆరోపణలకు మద్దుతుగా ఆయన ఆధారాలు చూపాలి' అని ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన గంభీర్ అన్నాడు.

ఇక ఇలాంటి ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరంలేదని ఆశిష్ నెహ్రా అన్నాడు. 'రణతుంగ వ్యాఖ్యలపై స్పందించి ఆ ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడంలేదు. 1996లో శ్రీలంక వరల్డ్‌కప్‌ టైటిల్‌ విజయాన్ని నేను ప్రశ్నిస్తే భావ్యంగా ఉంటుందా? అందువల్ల రణతుంగ వ్యాఖ్యల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు' అని నెహ్రా అన్నాడు.

అసలేం జరిగిందంటే?

అసలేం జరిగిందంటే?

శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అర్జున రణతుంగ 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపించాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అర్జున డిమాండ్‌ చేశాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను విస్మయపరిచిందని ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో అతడు పేర్కొన్నాడు.

Indian cricket team creates world record for most 300-plus scores in ODIs, surpass Australia | Oneindia News
సంగక్కర సమతూకంగా ఎంచుకోలేదు

సంగక్కర సమతూకంగా ఎంచుకోలేదు

ఫైనల్ జట్టుని అప్పటి కెప్టెన్ కుమార సంగక్కర సమతూకంగా ఎంచుకోలేదని.. తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేయడం తనకి ఆశ్చర్యం కలిగించిందని రణతుంగ వెల్లడించాడు. త్వరలో పక్కా సాక్ష్యాలు వెల్లడిస్తానని రణతుంగ చెప్పాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కి రణతుంగ కామెంటేటర్‌గా వ్యవహరించాడు.

అప్పుడు నేను భారత్లోనే ఉన్నాను

అప్పుడు నేను భారత్లోనే ఉన్నాను

‘ఆ రోజు నేను భారత్‌లోనే ఉన్నాను. ఫైనల్లో శ్రీలంక ఓడిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. తుది జట్టు ఎంపికపై నాకు చాలా అనుమానాలున్నాయి. అన్నీ ఆధారాలతో త్వరలోనే బయటపెడతా. కచ్చితంగా ఆ ఫైనల్‌పై విచారణ జరగాల్సిందే' అని రణతుంగ శుక్రవారం అన్నాడు. 2011 వరల్డ్ కప్ భారత్‌లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగింది.

28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్‌

28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్‌

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ తర్వాత 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్‌ని మళ్లీ చేజిక్కించుకుంది.

ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు

ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు

టోర్నీలో అప్పటి వరకు మెరుగ్గా రాణించిన మాథ్యూస్, హెరాత్, అజంతా మెండిస్, చమర సిల్వ స్థానంలో ఫైనల్‌ మ్యాచ్‌కి తిసారా పెరీరా, సురాజ్ రణదీవ్, కులశేఖర, కపుగెదరను కెప్టెన్ సంగక్కర తుది జట్టులోకి తీసుకున్నాడు. అయితే 2011 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌పై రణతుంగ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's World Cup heroes found former Sri Lanka captain Arjuna Ranatunga's demand for an inquiry into the 2011 final as "outrageous". India beat Sri Lanka by six wickets to win their second World Cup title in 50-over cricket.
Please Wait while comments are loading...