సాయం చేయడానికి సిద్ధం: యువీకి గంభీర్ పెళ్లి వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: తన స్నేహితురాలు, బాలీవుడ్ నటి మోడల్ హాజెల్ కీచ్‌ను టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పెళ్లి చేసుకోవడంతో సహచర క్రికెటర్లు యువీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు ఇంకో ముందడగు వేసి యువరాజ్‌పై ఛలోక్తులు కూడా వేస్తున్నారు.

ఫోటోలు: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన యువీ, కీచ్

తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా ఓపెనర్ గౌతంగంభీర్ చేరిపోయాడు. చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం 'బాబా రాందేవ్ సింగ్ డేరా'లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పంజాబీ సంప్రదాయం 'ఆనంద్ కరాజ్' పద్ధతిలో యువరాజ్, కీచ్‌ల వివాహం జరిగింది.

నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. మెరూన్‌, బంగారు వర్ణంలోని షేర్వాణీలో యువరాజ్ కత్తి చేతబట్టి రాజసం ఉట్టిపడింది. ఇక వధువు హజెల్‌కీచ్‌ రిచ్‌ డిజైనరీ లెహంగాతో అందంగా నగలు అలంకరించుకుంది. పెళ్లిలో యువరాజ్ సింగ్ ధరించిన షేర్వాణీపై గంభీర్ ఛలోక్తులు విసిరాడు.

Gautam Gambhir has a special marriage warning for Yuvraj Singh

యువీ ధరించిన షేర్వాణీ కింద ఒక చెస్ట్ గార్డ్ ధరించి ఉంటాడని గంభీర్ అన్నాడు. పెళ్లి తర్వాత ఎదురయ్యే బౌన్సర్ల నుంచి మగాళ్లను కాపాడేందుకు ఇంతవరకు ఏ చెస్ట్‌గార్డులు తయారుచేయలేదన్న విషయం తెలుసుకోవాలన్నాడు. ఓపెనర్‌గా బౌన్సర్లను మైదానంలోను, బయట ఎదుర్కోవాలంటే ఏం చేయాలో తన దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయని, ఈసారి కలిసినప్పుడు వాటిని చెబుతానని సరదాగా ట్వీట్ చేశాడు.

ఇంటర్నెట్‌లో వైరల్: పెళ్లి బట్టల్లో యువరాజ్, కీచ్ (ఫోటోలు)

అప్పటివరకు తన శుభాకాంక్షలను అందుకోవాలన్నాడు. పెళ్లయిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొత్త పెళ్లి కొడుక్కి సాయం చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా గంభీర్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు ట్విట్టర్‌లో సెహ్వాగ్ ఇలాంటి ట్వీట్లు చేస్తూ అందరినీ ఆటపట్టిస్తుండటం మనం చూశాం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian opener Gautam Gambhir had a word of advice for batsman Yuvraj Singh. The advice was nowhere related to cricket but for the latter’s new beginning. Yuvraj Singh is all set to get married to Hazel Keech and start a new innings of married life. Gautam Gambhir, who is a happily married man, had a word of caution for Yuvraj Singh.
Please Wait while comments are loading...