సరైన గుర్తింపు రాలేదు: 'కోహ్లీ, ధావన్‌ల కంటే పుజారానే బెస్ట్'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీతో చెలరేగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా పుజారాపై టీమిండియా వెటరన్ ప్లేయర్ గౌతం గంభీర్ మాట్లాడుతూ కోహ్లి, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ల కంటే స్థిరమైన ఆటగాడని చెప్పుకొచ్చాడు.

జాతీయ పత్రికక ఇచ్చిన ఇంటర్యూలో గంభీర్... మనం అంతగా టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఈ కారణంగానే పుజారాకు సరైన గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డాడు. వన్డే, టీ20 ఆటగాళ్లనే ప్రజలు ఆదరిస్తున్నారని, ఈ తెల్లబంతి ఆటగాడు.. ఎర్రబంతి ఆటలోకి వస్తే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందుతాడని పేర్కొన్నాడు.

Gautam Gambhir Rates Cheteshwar Pujara Over Virat Kohli & Shikhar Dhawan in Test Cricket

పుజారా ఒకే ఫార్మట్‌‌కు ఆడటం ద్వారా బ్యాటింగ్‌ శైలి మారకుండా రాణిస్తున్నాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇక పుజారా టెస్టు ఫార్మాట్‌కు సిద్దమైనట్లు షార్ట్‌ ఫార్మట్‌కు సిద్దం కావడం కొంత కష్టమేనని ఈ సందర్భంగా గంభీర్ అభిప్రాయపడ్డాడు.

వన్డే, టీ20ల్లో విఫలమైతే ఒత్తిడితో టెస్టుల్లో రాణించలేమని ఇది పుజారాకు కలిసొచ్చే విషయమని గంభీర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం మూడు ఫార్మెట్లలో ఆడుతున్న కోహ్లీ, ధావన్‌కు ఇదే పరిస్థతి ఎదరవుతుందని తెలిపాడు. టెస్టు ఫార్మెట్‌లో పుజారా రాణించడం వెనుక ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ కూడా ఉందని గంభీర్ అన్నాడు.

పుజారా క్వాలిటీ ప్లేయర్ అని, కౌంటీల్లో ఆడటం ద్వారా తన దృష్టంతా టెస్టు క్రికెట్ పైనే ఉందని గంభీర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభం అయిన తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌కు మన దేశంలో ప్రాముఖ్యత తగ్గిందని గంభీర్ అన్నాడు. ఇక ఇంగ్లండ్‌ గడ్డపై బంతిని ఎదుర్కొవడం చాల కష్టమని ఈ అనుభవం లంక పర్యటనలో పుజారాకు కలిసొచ్చిందని గంభీర్ అన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Virat Kohli recently called Cheteshwar Pujara one of the best batsmen in the Test team at present and former India opener Gautam Gambhir has gone one step ahead and said that at present Pujara is playing more consistently than even Kohli and opener Shikhar Dhawan in the longest format of the game.
Please Wait while comments are loading...