క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లలిత్ మోడీ: సోషల్ మీడియాలో ప్రకటన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్‌తో తనుకున్న అనుబంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత మోడీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఆయన రాజీనామా చేశారు.

ఈ మేరకు మూడు పేజీల లేఖను శుక్రవారం అర్ధరాత్రి బీసీసీఐ ప్రతినిధి రాహుల్‌ జోహ్రికి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.'తదుపరి తరాలకు అవకాశం ఇవ్వాలని భావించి క్రికెట్‌ అడ్మినిస్ట్రేషన్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు' అని మోడీ తన లేఖలో పేర్కొన్నారు.

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌ మోడీ ప్రస్తుతం భారత ఏజెన్సీల నుంచి తప్పించుకొని విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అతనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వారెంట్‌ జారీ చేయాలంటూ భారత్‌ ఇంటర్‌పోల్‌ను కోరినా ఇంటర్‌పోల్‌ అందుకు నిరాకరించింది.

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీ నాగౌర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌లో ఉండటంతో రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను బీసీసీఐ నిషేధం విధించింది. దీంతో గత మూడేళ్లలో రాజస్థాన్‌ ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌గానీ, అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌గానీ అతిథ్యం ఇవ్వలేకపోయింది.

Indo-Pak Cricket To Resume: PCB chief

అయితే లలిత్ మోడీ తాజా నిర్ణయంతో బీసీసీఐ నుంచి రూ.100 కోట్ల నిధులు అందుతాయని రాజస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Lalit Modi resigns from RCA
English summary
Former Indian Premier League or IPL chief and tainted cricket administrator Lalit Modi has resigned as the president of the Nagaur District Cricket Association in Rajasthan. In a late night resignation, Mr Modi put out three-page letter calling for the Rajasthan Cricket Associatiobn to be made "best again".
Please Wait while comments are loading...