న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తన కెరీర్‌లోనే ఇంగ్లాండ్ సిరిస్ టర్నింగ్ పాయింట్: జాదవ్

ఇంగ్లాండ్ జట్టుపై మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసి రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిన టీమిండియా యువ ఆటగాడు కేదార్ జాదవ్ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరిస్ తన కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుపై మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసి రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిన టీమిండియా యువ ఆటగాడు కేదార్ జాదవ్ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరిస్ తన కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. శుక్రవారం పూణెలో కేదార్ జాదవ్ మీడియాతో మాట్లాడాడు.

ఇంగ్లాండ్‌ సిరిస్‌లో పూణె వన్డేలో సెంచరీ సాధించిన తర్వాత అదే జోరు కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకుంటానని భావించానని తెలిపాడు. జాదవ్ అనుకున్నట్టే ఈ సిరీస్‌లో ఆ తర్వాత జరిగిన వన్డేల్లో కూడా రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

పూణె వన్డేలో కేదార్ జాదవ్ 76 బంతుల్లో 120 పరుగులతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆడుతున్న సమయంలో తనలో ఆత్మవిశ్వాసం ఏర్పడిందని, ఏ జట్టుపైనైనా పరుగులు చేయగలననే నమ్మకం వచ్చిందని చెప్పాడు.

పరిణితి లేకపోవడమే ఇందుకు కారణం

పరిణితి లేకపోవడమే ఇందుకు కారణం

ఇక టీమిండియా తరుపున ఆడే అవకాశం ఆలస్యంగా వచ్చిందని, పరిణితి లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పాడు. జట్టులో తనకు లభించిన అవకాశాన్ని విజయావకాశాలుగా మార్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు.

కోహ్లీ ఎంతగానో ప్రోత్సహిస్తుంటాడు

కోహ్లీ ఎంతగానో ప్రోత్సహిస్తుంటాడు

ఇక కెప్టెన్ కోహ్లీ తనను ఎంతగానో ప్రోత్సహిస్తుంటాడని, తన సహజశైలిలో ఆడేందుకు సాయపడ్డాడని వెల్లడించాడు. చాలా సందర్భాల్లో కోహ్లీని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, యువ ఆటగాళ్లుకు అతడు ఆదర్శమని కొనియాడాడు.

ఆ లక్షణాలు ధోనిలో ప్రత్యేకం

ఆ లక్షణాలు ధోనిలో ప్రత్యేకం

ఒత్తిడిని అధిగమించడం, సవాళ్లను ఎదుర్కోవడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండగలగడం వంటి లక్షణాలు ధోని ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. ధోని, కోహ్లీ నాయకత్వ లక్షణాలు, శైలి భిన్నంగా ఉంటాయని కేదార్ జాదవ్ చెప్పాడు.

వర్తమానంలో జీవిస్తా, భవిష్యత్ గురించి ఆలోచించను

వర్తమానంలో జీవిస్తా, భవిష్యత్ గురించి ఆలోచించను

ఇంగ్లాండ్‌తో వన్డే సిరిస్‌లో అద్భుత ప్రదర్శం చేయడం వల్ల జట్టు సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారా? అన్న ప్రశ్నకు తాను వర్తమానంలో జీవిస్తానని, భవిష్యత్ గురించి ఆలోచించనని అన్నాడు. రాబోయే రోజుల్లో రెండు, మూడు సిరీస్‌లకు టీమిండియాలో చోటు లభిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X