మీకు తెలుసా?: రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన ద్రవిడ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ బుధవారం 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మిస్టర్‌ డిపెండబుల్‌‌గా పేరుగాంచిన ద్రవిడ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు నమోదు చేశాడు. తన కెరీర్‌లో 164 టెస్టు మ్యాచ్‌లాడిన ద్రవిడ్ 13,288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి.

ఇక వన్డేల్లో 86 అర్ధసెంచరీలు చేసిన ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. వన్డే ఫార్మాట్‌లో అత్య‌ధిక అర్ధ సెంచ‌రీలు చేసిన‌వారిలో నాలుగోస్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్‌కు 16 ఏళ్లపాటు రాహుల్ ద్రవిడ్ సేవలందించాడు. ప్రస్తుతం ఇండియా ఏ కోచ్‌గా యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దుతూ భారత క్రికెట్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నాడు.

సెహ్వాగ్ ట్వీట్


బుధవారం 44వ పుట్టినరోజుని జరుపుకుంటున్న రాహుల్ ద్రవిడ్‌కు ముందుగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. రాహుల్ ద్రవిడ్‌లో నిబద్ధత (కమిట్‌మెంట్‌), జాగ్రత్త (కేర్‌), ఆట (క్లాస్‌)లో సొగసు ఉంటుందని కితాబిచ్చాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ


‘యువతరం క్రికెటర్లను ప్రోత్సహిస్తూ స్ఫూర్తిగా నిలిచిన ద్రవిడ్‌ భాయ్‌కు శుభాకాంక్షలు' అని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేశాడు.

మీకు తెలుసా?: రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన ద్రవిడ్


‘అసలైన మర్యాదస్తుడు, భారత క్రికెట్‌ గ్రేట్‌వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు శుభకాంక్షలు. ఒకసారి అతడు రెండు బంతుల్లో రెండు వికెట్ల తీసిన సంగతి మీకు తెలుసా?' అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయెల్‌ ట్వీట్‌ చేశారు.

గౌతం గంభీర్ ట్వీట్


తన సహచర ఆటగాడు, క్రికెట్ లెజెండ్ అయిన రాహుల్ ద్రవిడ్‌కు శుభాకాంక్షలు అని గంభీర్‌ పేర్కొన్నాడు.

ఇర్ఫాన్ పఠాన్


క్రికెట్ జెంటిల్మెన్ ద్రవిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ద్రవిడ్ లాంటి సీనియర్ ఆటగాడు ఉండటం లక్కీగా భావిస్తానని ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీట్ చేశాడు.

మహ్మద్‌ కైఫ్‌


44వ పుట్టినరోజుని జరుపుకుంటున్న ది వాల్ రాహుల్ ద్రవిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్ చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Often regarded as one of the greatest batsmen ever to grace the game, former India captain Rahul Dravid celebrates his 44th birthday on Wednesday. 'The Wall' featured in 164 Tests and 344 ODIs for India and amassed 10,000+ runs in both the formats in a trophy-laden career.
Please Wait while comments are loading...