ఈ వీడియో చూసి ఎంతో బాధపడ్డా: ట్విట్టర్‌లో హర్భజన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో టెక్నాలజీని విరివిగా వాడే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ క్రమంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫోన్లు, గ్యాడ్జెట్స్‌‌ను వాడుతుండటం మనం చూస్తున్నాం. తాజాగా ఓ చిన్నారి ఫోన్‌ను అతిగా వాడడం వల్ల మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ఆ చిన్నారి దగ్గరి నుంచి ఫోన్ తీసుకుంటే ఫోన్‌ కావాలని విలవిలా కొట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోని చూస్తే మనసు చలించిపోతుంది.

వీడియోలో ఓ చిన్నారి ఆసుపత్రిలో మంచంపై పడుకుని విలవిలా కొట్టుకుంటోంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌ను చూపించగానే తనకు తెలియకుండానే కొట్టుకోవడం ఆపేసి ఫోన్‌నే తదేకంగా చూస్తోంది. దానిని తీయగానే తిరిగి మళ్లీ విలవిలా కొట్టుకుంటోంది.

'ఈ వీడియో చూసి ఎంతో బాధపడ్డా. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సందర్భంగా తల్లిదండ్రలకు ఒక విజ్ఞప్తి. దయచేసి మీ పిల్లలను మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచండి. మితిమీరిన వాడకం ఎంతో ప్రమాదం' అని హర్భజన్ సింగ్ హెచ్చరించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team india veteran crickter Harbhajan Singh posts emotional video on his twitter account. In that post he requesting all parents to keep our kids away from mobiles & electronic gadgets.
Please Wait while comments are loading...