న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'తక్కువ కాలంలో తన కెరీర్‌ను పాండ్యా మలచుకున్న తీరు అద్భుతం'

ఈ మధ్య కాలంలో భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై ఇండియా ఏ, అండర్-19 జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై ఇండియా ఏ, అండర్-19 జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతి తక్కువ కాలంలో పాండ్యా తన కేరీర్‌ను మలచుకున్న తీరు అద్భుతమని ద్రవిడ్ అన్నాడు.

'ప్రతీ ఒక్క క్రికెటర్ పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి. ఎప్పుడూ ఒకే తరహాలో ఆడటం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ విషయాన్ని యువ క్రికెటర్లకు పదే పదే చెబుతూనే వస్తున్నా. ఇక్కడ హార్దిక్‌కే మనకు మంచి ఉదాహరణ' అని క్రిక్ ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో ద్రవిడ్ పేర్కొన్నాడు.

Hardik Pandya plays situations: Dravid

'సహజ సిద్ధమైన ఆటతో పాటు పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నాడు. ఈ క్రెడిట్ అంతా అతనిదే. హార్దిక్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నా సహజ సిద్ధమైన ఆటనే ఆడతాను అనే విధానం అన్ని వేళలా పని చేయదు. నీ ఆటను కాపాడుకుంటూనే వివిధ పరిస్థితుల్లో బ్యాటింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి' అని ద్రవిడ్ అన్నాడు.

'నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడు అందుకు తగ్గట్లుగా ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు అందుకు తగ్గట్టుగా రాణించాడు. రాబోయే రోజుల్లో 80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సందర్భంలో ఆడాల్సి ఉంటుంది. ఏదైతే ధోనితో చెన్నైలో వన్డేలో ఆడాడో అలా. హార్దిక్‌లో మరింత పరిణితి పెరిగిందనడానికి అతని ఆట తీరే నిదర్శనం' అని ద్రవిడ్ చెప్పాడు.

అంతేకాదు హార్దిక్ తరహాలో పరిస్థితులకు తగ్గట్టు ఆడితే అది మీ స్కిల్స్‌ను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ద్రవిడ్ సూచించాడు. నిజానికి ఆయా స్థానాల్లో బ్యాటింగ్ ఆర్డర్‌ను బట్టి హార్దిక్ ఆడుతున్న తీరు నిజంగా అద్భతమని ద్రవిడ్ కొనియాడాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఇండియా ఏ జట్టుకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉండగా, హార్ధిక్ పాండ్యా సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X