'మంకీగేట్' పోయి 'మంకీపేస్' వచ్చింది: బీసీసీఐ సవాల్‌కు అనూహ్య స్పందన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇషాంత్‌ గేమ్‌ ఫేస్ ఛాలెంజ్‌ అంటూ బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోకి అనూహ్య స్పందన లభిస్తోంది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగుళూరులో జరిగిన రెండో టెస్టులో 'డీఆర్‌ఎస్‌' వివాదం మ్యాచ్‌ కంటే ఎక్కువగా పాపులర్ అయింది.

స్మిత్‌ను వెక్కిరించిన ఇషాంత్ శర్మ

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెక్కిరించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో స్టీవ్ స్మిత్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఇషాంత్ శర్మ పదే పదే ప్రయత్నించాడు. ప్రతి బంతికీ స్మిత్ వైపు గుర్రుగా చూస్తూ అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

తొలుత స్వీకరించిన టీవీ కామెంటేట‌ర్లు

అందులో భాగంగా అదోలా వింతగా మొహం పెట్టి స్మిత్‌ను అనుకరించాడు. తొలుత ఇషాంత్ విసిరిన చాలెంజ్‌ను టీవీ కామెంటేట‌ర్లు స్వీక‌రించి ఇషాంత్ మాదిరి అనుకరించారు. అప్పటి నుంచి ఇషాంత్‌ గేమ్‌ ఫేస్ ఛాలెంజ్‌ అంటూ ఒక హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సోషల్‌ మీడియాలో పలువురు ఇషాంత్‌లాగే భావాలు పలికించారు.

క్రికెట్ అభిమానులకు సవాల్ విసిరిన బీసీసీఐ

తాజాగా బీసీసీఐ క్రికెట్ అభిమానులకు ఒక సవాల్ విసిరింది. రాంచీలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు లంచ్‌ విరామ సమయంలో కామేంటేటర్లు అందరూ ఇషాంత్‌ లాగా హావభావాలు పలికిస్తూ కనిపించారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసి క్రికెట్ అభిమానులకు ఓ సవాల్‌ విసిరింది.

బీసీసీఐ పోస్టుకు అనూహ్య స్పందన

అభిమానులు కూడా ఇషాంత్ మాదిరి హావభావాలు పలికిస్తూ ఉన్న వీడియో లేదా ఫొటోలను తమతో పంచుకోవాలంటూ బీసీసీఐ సూచించింది. బీసీసీఐ పోస్టు చేసిన ఈ వీడియోకి ఇప్పుడు అనూహ్య స్పందన లభిస్తోంది. పలువురు క్రికెట్ అభిమానులు అచ్చం అలానే అనుకరిస్తూ వారి వీడియోను పోస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Monkeygate is the term that has defined the acrimonious cricketing relationship between India and Australia in the last decade. The controversy involving Harbhajan Singh and Andrew Symonds erupted during the Sydney Test and threatened to derail the 2007-8 tour. Nine years on, in the Bangalore Test, it was less ‘Monkeygate’ and more ‘Monkey face’.
Please Wait while comments are loading...