దేవున్ని ప్రార్ధిస్తున్నా: యువీకి మాజీ వదిన హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌లు బుధవారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బ్యాచిలర్‌గా ఉన్న తన స్నేహితురాలైన హాజెల్ కీచ్‌ను పెళ్లి చేసుకున్నందుకు క్రికెటర్లతో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు.

అయితే యువీ మాజీ వదిన ఆకాంక్ష శర్మ మాత్రం వారిద్దరూ యువీ తల్లి షబ్నం సింగ్‌కు దూరంగా ఉండే మంచిదని హెచ్చరిక జారీ చేసింది. యువరాజ్ సింగ్ సోదరుడు జోరావర్ సింగ్‌ను ఆకాంక్ష శర్మ పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.

ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇటీవలే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా బాలీవుడ్‌లో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌లో ఆకాంక్ష పాల్గొంది. అందులో తన అత్తగారు, యువీ తల్లి షబ్నం సింగ్ వల్లే తన వైవాహికజీవితంలో విభేదాలు వచ్చి విడిపోయామని చెప్పిన సంగతి తెలిసిందే.

నూతన దంపతులకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు

నూతన దంపతులకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు

తన అత్తగారింట్లో తనను ఓ పనిమనిషిలా చూశారని ఆకాంక్ష చెప్పింది. అంతేకాదు యువీ తల్లిపై పలు ఆరోపణలు సైతం చేసింది. ఈ నేపథ్యంలో ఆకాంక్షపై పరువు నష్టం దావా కేసు పెడతామని షబ్నం సింగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా బుధవారం యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల వివాహం నేపథ్యంలో కొత్త దంపతులకు ఏం చెప్పాలని అనుకుంటున్నారని ఆకాంక్షను మీడియా ప్రశ్నించింది.

షబ్నం జోక్యం ఉండకూడదని దేవున్ని ప్రార్ధిస్తున్నా

షబ్నం జోక్యం ఉండకూడదని దేవున్ని ప్రార్ధిస్తున్నా

‘వారి జీవితాల్లో షబ్నం జోక్యం ఉండకూడదని దేవున్ని ప్రార్ధిస్తున్నాను. హాజెల్‌ కీచ్ చాలా అదృష్టవంతురాలు. ప్రతి విషయంలోనూ అమ్మ మాటే వినే మా ఆయనలా కాకుండా యువీ లాంటి మంచి వ్యక్తిని వివాహం చేసుకుంది. ఏమైనా యువీ ఢిల్లీలో మూడు రోజులకు మించి ఉండడులే' అని ఆకాంక్ష చెప్పింది.

వివాహ బంధంతో ఒక్కటైన యువీ, హాజెల్ కీచ్

వివాహ బంధంతో ఒక్కటైన యువీ, హాజెల్ కీచ్

యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం ‘బాబా రాందేవ్ సింగ్ డేరా'లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్' పద్ధతిలో

పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్' పద్ధతిలో

పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్' పద్ధతిలో యువరాజ్, కీచ్‌ల వివాహం జరిగింది. వివాహం అనంతరం నూతన దంపతులు బాబా రామ్‌సింగ్‌ ఆశీర్వాదాలు తీసుకున్నారు. యువరాజ్‌ తల్లి షబ్నం సింగ్‌ అత్యంత ఇష్టపడే, ఎంపికచేసిన వేదికలో యువీ.. హజెల్‌కీచ్‌ మెడలో తాళి కట్టాడు.

 తల్లి షబ్నమ్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షణ బాధ్యతలు

తల్లి షబ్నమ్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షణ బాధ్యతలు

నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఏర్పాట్లను తల్లి షబ్నమ్ సింగ్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఈ పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా బాబా రాందేవ్ సింగ్ డేరా వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయిన యువీ, కీచ్‌ల జంట

పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయిన యువీ, కీచ్‌ల జంట

నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. మెరూన్‌, బంగారు వర్ణంలోని షేర్వాణీలో యువరాజ్ కత్తి చేతబట్టి రాజసం ఉట్టిపడింది. ఇక వధువు హజెల్‌కీచ్‌ రిచ్‌ డిజైనరీ లెహంగాతో అందంగా నగలు అలంకరించుకొని ఉంది. ఈ వివాహానికి యువీ తండ్రి యెగ్‌రాజ్‌ సింగ్‌ హాజరుకాలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
So it comes as no surprise that when Spotboye got in touch with Akansha to get her reaction on Yuvraj and Hazel Keech’s marriage which was held yesterday, the sister in law had only one thing to say, “I pray they stay alone and have no meddling from Shabnam. Hazel is lucky that she got married Yuvi, who is a wonderful person. Unlike my husband, he won’t take any interference from his mother. Anyway, he never stays in Delhi for more than 3 days.”
Please Wait while comments are loading...