ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత ఓటమికి ప్రధాన కారణం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లను ఆడించి చారిత్రాత్మక తప్పదం చేసిందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌ల్లో కలిపి టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీసింది ఒకే ఒక్క వికెట్.

పాక్ చేతిలో ఓటమి: టీవీలు ధ్వంసం.. పోస్టర్లు దగ్థం (వీడియో)

అలాంటి బౌలర్‌ను ఫైనల్లో ఆడించి టీమిండియా వ్యూహాత్మక తప్పిదం చేసిందని అంటున్నారు. 'టాస్‌ గెలిస్తే భారత్‌కు బ్యాటింగ్‌ ఇవ్వొద్దు' భారత జట్టుతో ఫైనల్‌కు ముందు పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్య ఇది. ప్రంపచంలోనే బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమిండియా భారీ స్కోరు చేస్తే పాక్‌ ఒత్తిడికి లోనవుతుందని అతడి విశ్లేషణ.

అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం మరోలా ఆలోచించాడు. టాస్ గెలిచిన కోహ్లీ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీని ఫలితమే ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా 180 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. టాస్‌ నెగ్గగానే ఫీల్డింగ్‌ ఎంచుకోవడం, పేలవమైన బౌలింగే భారత జట్టు ఓటమికి అసలు కారణాలు.

ఇంగ్లాండ్‌లో పిచ్‌లు కాస్తంత భిన్నం

ఇంగ్లాండ్‌లో పిచ్‌లు కాస్తంత భిన్నం

నిజానికి ఇంగ్లాండ్‌లో పిచ్‌లు కాస్తంత భిన్నంగా ఉంటాయి. ఛాంపియన్స్ టోర్నీ ఆరంభం నుంచీ అక్కడ భారీగా వర్షాలు పడటంతో ఐసీసీ నిర్వాహకులు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలో
ఛాంపియన్స్‌ ట్రోఫీలో టాస్‌ గెలవగానే అన్ని జట్లు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపిస్తున్నాయి.

టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ

టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ

అయితే ఇదే వ్యూహంతో కోహ్లీ కూడా టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడని అంటున్నారు. ఇదే టీమిండియా ఓటమికి కారణమైందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండురోజులుగా లండన్‌లో వర్షం లేదు. ఆదివారం ఉదయం నుంచి ఎండ ప్రభావం కనిపించింది.

పిచ్ విషయానికి వస్తే ఫ్లాట్‌గా, పొడిగా

పిచ్ విషయానికి వస్తే ఫ్లాట్‌గా, పొడిగా

కానీ ఎక్కువశాతం పొడిగానే ఉండే అవకాశం ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఫ్లాట్‌గా, పొడిగా ఉంది. ఇలాంటి పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోవడం జట్టుకు తీరని నష్టం చేసింది. అదే టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏం జరిగింది

పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏం జరిగింది

నిజానికి ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసే ఆ జట్టుపై 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి ఉంటే భారీస్కోరు కాకపోయినా కనీసం 260, 270 పరుగులు చేసినా ఫలితం ఉండేది.

పాక్ ఒత్తిడికి లోనయ్యేది

పాక్ ఒత్తిడికి లోనయ్యేది

ఇటీవల కాలంలో నిలకడలేమితో ఉన్న పాకిస్థాన్ ఆ స్కోరుని కూడా చేధించలేక ఒత్తిడికి లోనయ్యేది. నిజానికి టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో అదే జరిగింది. ఛేదనల్లో బాగా తడబడుతుందన్న పేరు పాకిస్థాన్‌కు ఉంది. ఆదివారం నాటి మ్యాచ్లో కోహ్లీ మన బలాన్ని నమ్ముకోకుండా, పరిస్థితులకు తగ్గట్లు వెళ్లాలడమే భారత్ ఓటమికి కారణమైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If there is one facet about India’s play in this edition of the Champions’ Trophy that merits comment, it is the gradual elimination of error.
Please Wait while comments are loading...