భారత్ Vs పాక్: కోహ్లీని ఇబ్బంది పెట్టిన ఆ బౌలర్ రాణిస్తాడా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరికొన్ని గంటల్లో హైటెన్షన్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని ది ఓవల్ వేదికగా జరగనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఈ హైటెన్షన్ మ్యాచ్‌కి సంబంధించిన కొన్ని విషయాలను ఐసీసీ ప్రత్యేకంగా తన ట్విట్టర్ ఖాతాలో అభిమానుల కోసం పోస్టు చేస్తోంది. అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ముప్పుతిప్పులు పెట్టిన పాక్ బౌలర్ జునైద్ ఖాన్ గురించి ప్రస్తావించింది. పాక్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ బౌల‌ర్ జునైద్ ఖాన్ ఈ టోర్నీలో జట్టులో కీల‌క బౌల‌ర్‌గా ఎదిగాడు.

icc champions trophy 2017: Junaid khan dismissed virat kohli 3 times in odis

ఇప్ప‌టివ‌ర‌కు వ‌న్డేల్లో జునైద్ మూడుసార్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. జునైద్ బౌలింగ్‌ను ఎదుర్కోవ‌డంలో విరాట్ కోహ్లీ గ‌తంలో ఇబ్బందులు పడ్డాడు. వ‌న్డేల్లో జునైద్ వేసిన 22 బంతుల‌ను ఆడిన కోహ్లీ అందులో కేవ‌లం రెండు పరుగులు మాత్ర‌మే చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో కూడా జునైద్ మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

పాక్ తొలిసారి: ఇంగ్లాండ్‌ గడ్డపై ఆదివారం ఏం జరుగుతుందో?

టోర్నీలో భాగంగా టీమిండియాతో జూన్ 4వ తేదీన జరిగిన మ్యాచ్‌కు తుది జట్టులోనే లేని జునైద్‌, ఆ తర్వాతి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా ఆడిన 3 మ్యాచ్‌ల్లో అతను 7 వికెట్లు తీసి ప్రధాన బౌలర్‌గా మారాడు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్లో జునైద్ బౌలింగ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఎదుర్కుంటాడో ఆస‌క్తిగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan were at the receiving end of a massive loss to India in the group stage. Sarfraz Ahmed's side did not evoke a lot of confidence. Was Pakistan cricket dead, people wondered.
Please Wait while comments are loading...