సెమీ ఫైనల్ 2: భారత్-బంగ్లా మ్యాచ్, ఆసక్తికర విషయాలివే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి సన్నద్ధమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే పైనల్లో పాక్‌ను ఢీకొట్టనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఏ రకంగా చూసినా.. ఏ అంశంలోనూ పోల్చినా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్ అన్నది అందరికీ తెలిసిందే. ఆటపరంగా, రికార్డులపరంగా బంగ్లాకు అందనంత ఎత్తులో టీమిండియా ఉంది. అయితే టెస్టు, టీ20లతో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం.

క్రికెట్‌లో పసికూన అయిన బంగ్లాదేశ్ తెగువకు, పోరాటానికి పెట్టింది పేరు. గతంలో ఒకటి, రెండుసార్లు భారత్‌పైనే దాన్నినిరూపించుకున్నారు. 2007 వరల్డ్‌ కప్‌ ప్రదర్శనను పునరావృతం చేసి మేజర్‌ టోర్నీలో తొలిసారి తుది పోరుకు చేరి రికార్డు సృష్టించాలని బంగ్లా కోరుకుంటోంది.

ICC Champions Trophy 2017: Semi-final India vs Bangladesh on June 15

భారత్-బంగ్లా మ్యాచ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు:

* ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ను బంగ్లా ఒకేసారి ఓడించింది. అది కూడా 2007 వరల్డ్‌ కప్‌లో
* ఆ తర్వాతి ఐదు ఐసీసీ మేజర్ టోర్నీల్లో బంగ్లాదేశ్పై భారత్‌ విజయం సాధించింది.
* ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి బంగ్లాదేశ్ తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
* టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ తొలి పవర్‌ పవర్‌ప్లేల్లో ఒక వికెట్‌ మాత్రమే చేజార్చుకుంది.
* లీగ్‌ దశలో తొలి పవర్‌ ప్లేల్లో భారత్‌ ఎకానమీ రేట్‌ 4.33. లీగ్‌ దశలో భారత్‌దే అత్యుత్తమం.
* ఇక బంగ్లాదేశ్‌ ఎకానమీ 5.60గా ఉంది. అన్ని జట్ల కన్నా బంగ్లాదే పేలవం.
* ఇప్పటివరకు బంగ్లాదేశ్‌తో ఆడిన 32 వన్డేల్లో భారత్‌ 26 మ్యాచ్‌ల్లో గెలిచింది.
* బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే యువరాజ్ సింగ్‌కు కెరీర్‌లో 300వ వన్డే.
* రోహిత్ శర్మకు ఇప్పటిదాకా 39 బంతులు వేసిన ముస్తాఫిజుర్ 38 పరుగులిచ్చి మూడుసార్లు అతన్ని అవుట్ చేశాడు.
* భారత్-బంగ్లా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోస ఢిల్లీలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
* మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ను ఈ తెరలపై వీక్షించొచ్చు.
* ఈ మ్యాచ్‌కి వర్ష ప్రభావం లేదు. బర్మింగ్‌హామ్‌లో వాతావరణం చక్కబడింది. వర్షం మ్యాచ్‌కు అంతరాయాలు కలిగించే అవకాశం లేకపోవడం శుభవార్తే.

జట్లు (అంచనా):
టీమిండియా: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్‌), యువరాజ్‌, ధోనీ (కీపర్‌), కేదార్‌, హార్దిక్‌, జడేజా, అశ్విన్‌, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్‌, బుమ్రా.
బంగ్లాదేశ్‌: తమీమ్‌, సౌమ్య సర్కార్‌, షబ్బీర్‌ రహ్మాన్‌, ముష్ఫికర్‌ (కీపర్‌), షకీబల్‌, మహ్మదుల్లా, మొసాదెక్‌, తస్కిన్‌, మోర్తజా (కెప్టెన్‌), రూబెల్‌, ముస్తాఫిజుర్‌.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Professionalism will be pitted against passion when defending champions India square off with Bangladesh in the second semi-final of the ICC Champions Trophy on Thursday.
Please Wait while comments are loading...