'నో బాల్'‌పై జర్నలిస్ట్ ప్రశ్న: కోహ్లీకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కెప్టెన్‌గా మ్యాచ్‌లో తన జట్టుని గెలిపించుకోవడం ఒక ఎత్తైతే, గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో విలేకరులు అడిగే ప్రశ్నలకు బదులివ్వడం మరో ఎత్తు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో పాక్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి హాజరయ్యాడు.

ICC Champions Trophy 2017: Virat Kohli bemused after confusing question by journalist

ఈ సమావేశం ఒకింత భావోద్వేగంగా, ఒకింత సరదాగా సాగిందని చెప్పాలి. ఈ మీడియాలో సమావేశంలో ఓ జర్నలిస్ట్ అడిగిన వింత ప్రశ్నకు కోహ్లీ సైతం బిత్తరపోయాడు. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు విరాట్ కోహ్లీ వరుసగా సమాధానాలిస్తున్నాడు.

ఈ సందర్భంలో బుమ్రా వేసిన 'నో బాల్‌' గురించి ఓ జర్నలిస్టు అడిగాడు. మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడే పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ బుమ్రా బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అయితే బుమ్రా వేసిన ఆ బంతిని అంఫైర్ నో బాల్‌గా ప్రకటించడంతో జమాన్‌కు లైఫ్ లభించింది.

ఈ లైఫ్‌ని సద్వినియోగం చేసుకున్న ఫకార్ జమాన్ చెలరేగాడు. సెంచరీ సాధించడంతో పాటు భారత్‌పై పాక్‌ 180 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీని గురించి కోహ్లీ-జర్నలిస్ట్‌ల మధ్య జరిగిన సంభాషణ ఈ విధంగా ఉంది.

జర్నలిస్ట్‌: కెప్టెన్‌.. మీరు టాస్‌ గెలిచారు. అంతేకాకుండా నోబాల్‌కు వికెట్‌ సాధించారు. ఇదీ మీకు బాగా అనిపించిందా?
కోహ్లీ: ఏమిటి? అది బాగా అనిపించడం ఏమిటి?
జర్నలిస్ట్‌: అవును. ఆనందించే విషయమే కదా? టాస్‌ గెలువడం, నోబాల్‌కు వికెట్‌ సాధించడం? ఇది మీకు మంచిగా అనిపించలేదా?
కోహ్లీ: మంచిగా అనిపించడమా? ఎవరికి?
జర్నలిస్ట్‌: మీకే..
కోహ్లీ: నోబాల్‌ మంచిగా అనిపించడం ఏమిటి?
జర్నలిస్ట్‌: ఎందుకంటే నోబాల్‌కు వికెట్‌ వచ్చింది కదా!
కోహ్లీ: మీరు మాట్లాడుతున్నదాంట్లో ఏమన్న అర్థం ఉందా? ఏం జరుగుతోంది.. అంటూ కోహ్లీ బదులిచ్చాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Virat Kohli had to deal with one such question at the press conference following India's embarrassing loss against Pakistan at the ICC Champions Trophy final on Sunday.
Please Wait while comments are loading...