ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్‌దే: కోహ్లీ కెప్టెన్సీ అద్భుతమన్న దాదా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోపీ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కెప్టెన్సీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించాడని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ పేర్కొన్నాడు. 'దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్య బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించాడు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం సరైన నిర్ణయం' అని పేర్కొన్నాడు.

'కెప్టెన్‌గా కోహ్లీ సహచర ఆటగాళ్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. ప్రస్తుత భారత జట్టులో చాలా మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ నుంచి కేదార్‌ జాదవ్‌ వరకు ఆటగాళ్లందరూ మ్యాచ్‌ను గెలిపించేవారే' అని గంగూలీ అన్నాడు.

ICC Champions Trophy 2017: Virat Kohli’s captaincy was fantastic against South Africa, says Sourav Ganguly

కోహ్లీ బ్యాటింగ్ గురించి కూడా గంగూలీ స్పందించాడు. 'ఈ ఫార్మాట్‌లో కోహ్లీ చాలా బాగా ఆడతాడు. బ్యాటింగ్‌లో వంద శాతం న్యాయం చేస్తాడు. సహచరుల నుంచి అదే స్థాయిలో సహకారం అందాలని కోరుకుంటాడు' అని గంగూలీ తెలిపాడు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు.

రవీంద్ర జడేజా, కోహ్లీ, హార్దిక్‌ పాండ్య తదితరులు ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించారని గంగూలీ అన్నాడు. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగే సెమీస్‌ మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతుందని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

'దక్షిణాఫ్రికా కంటే మెరుగైన ప్రదర్శన బంగ్లా చేస్తుందని భావిస్తున్నా. ఇండియా-ఇంగ్లాండ్‌ జట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ చేరుకుంటాయి. ట్రోఫీ గెలిచేందుకు ఇంగ్లాండ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి' అని గంగూలీ పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After India secured an emphatic win over South Africa, former Indian skipper Sourav Ganguly applauded the efforts of Virat Kohli and said that his captaincy on field was fantastic.
Please Wait while comments are loading...